హైదరాబాద్ ట్రాఫిక్ కొత్త రూల్: ఇకపై లైసెన్స్ లేకుండా నడిపితే…ఎలాంటి కఠినమైన శిక్షో తెలుసా.?

నేటి త‌రుణంలో మ‌న దేశంలో రోడ్డు ప్ర‌మాదాలు ఎలా జ‌రుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. రోజు రోజుకీ ఆ ప్ర‌మాదాలు పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. వాటిల్లో చాలా వ‌ర‌కు రోడ్డు ప్ర‌మాదాలు తాగి వాహ‌నం న‌డ‌పడం వ‌ల్లే జ‌రుగుతున్నాయి. ఇక కొంద‌రైతే ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించ‌డం, అతి వేగంగా వాహ‌నాల‌ను న‌డ‌ప‌డం వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. దీంతోపాటు క‌నీస వ‌య‌స్సు లేకుండా పిల్ల‌లు వాహ‌నాల‌ను న‌డిపించ‌డం వ‌ల్ల కూడా రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ త‌ర‌హా ప్ర‌మాదాల‌ను త‌గ్గించ‌డం కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే…

క‌నీస వ‌య‌స్సు లేకుండా పిల్ల‌లు ఎవ‌రైనా వాహ‌నాన్ని న‌డిపితే అలాంటి పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ఒక రోజు జైలు శిక్ష వేస్తారు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. ప్ర‌స్తుతం ఈ రూల్‌ను హైద‌రాబాద్‌లో అమ‌లు చేస్తున్నారు. అది మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ది కూడా. గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో వాహ‌నాల‌ను న‌డుపుతూ ప‌ట్టుబ‌డ్డ పిల్ల‌ల తల్లిదండ్రులు 45 మందికి ఒక రోజు జైలు శిక్ష వేశారు. ఇది ఇప్ప‌టికీ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దీని వ‌ల్ల త‌ల్లిదండ్రుల‌కు తాము ఏం చేస్తున్నామో తెలుస్తుంద‌ని పోలీసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

సాధార‌ణంగా త‌ల్లిదండ్రులు ఎవ‌రైనా తమ పిల్ల‌లు కోరుకునే వాటికి అడ్డం చెప్ప‌ర‌ని, ఇదే వారి కొంప ముంచుతుంద‌ని పోలీసులు అంటున్నారు. త‌ల్లిదండ్రులు వెనుకా ముందు చూడ‌కుండా పిల్ల‌ల‌కు త‌మ వాహ‌నాల‌ను ఇస్తున్నార‌ని, దీంతో క‌నీస జ్ఞానం తెలియ‌ని పిల్లలు రోడ్ల‌పై అతి వేగంగా, నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డుపుతూ ఇత‌ర వాహ‌న‌దారుల‌కు ఇబ్బందుల‌ను కలిగిస్తున్నార‌ని పోలీసులు అంటున్నారు. అందుక‌నే ఈ రూల్‌ను తెచ్చామ‌ని, దీంతోనైనా త‌ల్లిదండ్రులు, పిల్లల వ్య‌వ‌హార శైలిలో మార్పు వ‌స్తుంద‌ని తాము భావిస్తున్నామ‌ని చెప్పారు. పిల్ల‌లు తెలిసీ తెలియ‌ని జ్ఞానంతో వాహనాల‌ను న‌డుపుతూ వారు ప్ర‌మాదాల బారిన ప‌డ‌డ‌మే కాకుండా తోటి వారి ప్రాణాల‌ను కూడా తీస్తున్నార‌ని, ఇది ఎంత మాత్రం ఉపేక్షించ‌రాద‌ని, అందుక‌నే ఈ రూల్‌ను అమ‌లులోకి తెచ్చామ‌ని పోలీసులు అంటున్నారు. ఏది ఏమైనా.. ఈ నిర్ణ‌యం కొంత వ‌ర‌కు మేలు చేసేదే అయినా, పిల్ల‌ల‌ను పట్టుకుంటేనే క‌దా, వారి త‌ల్లిదండ్రుల‌కు శిక్ష వేసేది. వారు త‌ప్పించుకుని తిరిగితే ఏ లాభం ఉంటుంది చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top