కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బి, ఇన్ఫ్లూయెంజా. ఈ ఐదు వ్యాధులు ప్రాణాంతకమైనవి. చిన్నారులకు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా 6 నెలల లోపు వయస్సు ఉన్న పసికందులకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఒకప్పుడు 5 టీకాలు వేర్వేరుగా వేయించేవారు. కానీ ఇప్పుడలా కాదు. ఈ ఐదు వ్యాధులకు కలిపి ఒకే టీకాను తయారు చేశారు. అందులో ఈ 5 వ్యాధులకు చెందిన మెడిసిన్ ఉంటుంది. అవి ఆ ఐదు రోగాలను రాకుండా చేస్తాయి. ఇంతకీ… ఆ 5 రోగాలను నయం చేసే ఆ ఒకే ఒక టీకా ఏంటో తెలుసా..? అదే పెంటావలెంట్..!
పెంటావలెంట్ టీకాలో కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బి, ఇన్ఫ్లూయెంజా వ్యాధులను రాకుండా చూసే 5 రకాల మెడిసిన్లు ఉంటాయి. అవి ఆ వ్యాధుల నుంచి పసికందులను రక్షిస్తాయి. చిన్నారులకు 6, 10, 14 వారాల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కచ్చితంగా ఈ పెంటావలెంట్ టీకాను వేయించాలి. లేదంటే ముందు చెప్పిన ఆ ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అయితే ఈ టీకాకు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.
ఎందుకంటే ఈ పెంటావలెంట్ టీకా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభిస్తోంది. అది కూడా ఉచితంగానే. తల్లిదండ్రులు తమ పసికందులకు పైన చెప్పిన విధంగా 6, 10 లేదా 14 వారాల వయస్సు రాగానే ఈ టీకాను వేయించాలి. దీంతో చిన్నారికి రక్షణ లభిస్తుంది. ఈ టీకాను సరైన సమయంలో వేయించకపోవడం వల్ల మన దేశంలో ఏటా కొన్ని లక్షల మంది పసికందులు మృత్యువాత పడుతున్నారు. కనుక తప్పనిసరిగా పెంటావలెంట్ను వేయించండి. ఈ సమాచారం అందరికీ షేర్ చేయండి..!