పరీక్ష రాయాలంటే “బ్రా” తీసేసి రమ్మన్నారు..! ఇదెక్కడి నీచమైన సంఘటన..?

భారత స్త్రీ అర్ధ రాత్రి ఒంటరిగా భయంలేకుండా రోడ్డు మీద తిరగలిగినప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని అన్నారు ఆ రోజుల్లో “గాంధీ” గారు. కానీ మన సమాజంలో పగలు తిరగాలన్న స్త్రీలకూ రక్షణ లేకుండా పోయింది. చివరికి పరీక్ష కేంద్రాల్లో కూడా సంరక్షణ లేకుండా పోయింది. పనికి రాణి నియమాలతో యువతులకు అవమానం జరిగింది. ఈ దుర్ఘటన కేరళలో “నీట్” పరీక్ష నిర్వహిస్తుండగా జరిగింది. సడన్ గా ఓ అమ్మాయి పరీక్ష హాల్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి తన లో దుస్తులను తల్లికి ఇచ్చేసి వెళ్ళిపోయింది..! అసలు వివరాలు చూడండి!

కేర‌ళ‌లో నీట్ ప‌రీక్ష రాసేందుకు వ‌చ్చిన అమ్మాయిల‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. ప‌రీక్ష రాసేందుకు హాల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గానే అక్క‌డి అధికారులు అమ్మాయిల ఇన్న‌ర్‌వేర్ తీసేసి ప‌రీక్ష హాల్‌లోకి రావాల‌ని ఆదేశించారు. చేసేదేమీ లేక విద్యార్థినులు వారి ఇన్న‌ర్‌వేర్స్ వ‌దిలి ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఓ తండ్రికి కూడా చేదు అనుభవం ఎదురయ్యింది.. జీన్స్ ప్యాంట్ ధ‌రించ‌డంతో అధికారులు ప‌రీక్ష హాల్లోకి రానివ్వ‌లేదు. దీంతో ఆ విద్యార్థిని తండ్రి మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ బ‌ట్ట‌ల దుకాణంకు వెళ్లి కొత్త డ్రెస్ కొని తీసుకొచ్చాడు. ఇక ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన విద్యార్థుల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా క‌నిపించింది.

వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ కేంద్రాల్లో పలుచోట్ల అభ్యర్థులకు ఇలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పొడవు చేతుల చొక్కాలు వేసుకొస్తే కత్తిరించేశారు. హెయిర్‌ పిన్స్, హెయిర్ బ్యాండ్స్ తీసేయాల్సి వచ్చింది.

పరీక్ష అనంతరం విద్యార్థులు మీడియాకు ఇదంతా చెప్పారు. ఈ వార్త సోష‌ల్ మీడియాకు ఎక్క‌డంతో మ‌నుషులా మృగాళ్లా అంటూ నెటిజెన్లు దుమ్మెత్తి పోశారు. ఆ స్థానంలో అధికారుల కూతురు ఉండి ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో ఒక్క‌సారి ఊహించండి అంటూ కామెంట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌తో దేశం కొన్ని ద‌శాబ్దాల వెన‌క్కి వెళ్లిన‌ట్లయ్యింద‌ని ఇంకొంద‌రు వ్యాఖ్యానించారు.

Comments

comments

Share this post

scroll to top