ఎస్సై అయ్యుండి పరాయి వ్యక్తి భార్యతో అక్రమసంబంధం…ఫోటోలను ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఆమె భర్త..!

ఆయ‌న స‌మాజంలో శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడాల్సిన ఓ పోలీస్ అధికారి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల్సిన స‌దరు ఎస్సై గారు క్ర‌మ‌శిక్ష‌ణ తప్పారు. ఓ వివాహిత‌తో వివాహేతర సంబంధంతో రచ్చకెక్కాడు. ఆయనగారి సరసాల ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల లోకి వెళితే..ప్రస్తుతం కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ ఎస్‌ఐ-2గా పని చేస్తున్న విజయ్‌ కుమార్‌ మొట్టమొదటి పోస్టింగ్‌లోనే ‘పక్క చూపులు’ ప్రారంభించారు. ముసునూరు ఎస్‌ఐగా పని చేస్తుండగా నూజివీడుకు చెందిన ఓ బ్యూటీషియన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమె భర్తకు ఈ విషయం తెలిసి… వివాదం విడాకుల దాకా వెళ్లింది. అయినప్పటికీ… ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ వెనక్కి తగ్గలేదు. మూడేళ్లుగా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నారు.

దీనిపై ఆగ్రహంతో ఉన్న ఆమె భర్త… వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను సేకరించి తానే బయటపెట్టినట్లు భావిస్తున్నారు. నాలుగైదు రోజులుగా ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ సృష్టిస్తున్నాయి. ‘నా భార్యతో ఉన్న ఎస్సై విజయ్‌ కుమార్‌ వల్ల నా ప్రాణాలకు హాని ఉంది. నన్ను కాపాడండి’ అంటూ ఆ మహిళ భర్త ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. ఇది ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. విజయ్‌ కుమార్‌ను ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠీ విధుల నుంచి తప్పించి వీఆర్‌కు పంపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

Comments

comments

Share this post

scroll to top