బొప్పాయి తో కలిగే 11 ఉపయోగాలు..ఇవి తెలిస్తే మీ ఇంట్లో ఓ బొప్పాయి చెట్టును పెంచుతారు.

డెంగీ జ్వ‌రం వ‌చ్చిన వారి శ‌రీరంలో ప్లేట్‌లెట్ల‌ను పెంచేందుకు బొప్పాయి పండు, ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఎన్నో ర‌కాల పోష‌కాల‌కు బొప్పాయి పండు నిల‌యంగానూ ఉంది. దీన్ని నిత్యం తీసుకుంటే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే బొప్పాయి ద్వారా మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

papaya

1. బొప్పాయి పువ్వు ఒక‌టి తీసుకుని బాగా న‌లిపి దాన్ని పేను కొరికిన చోట రుద్దితే అక్క‌డ వెంట్రుక‌లు మ‌ళ్లీ మొలుస్తాయి. 4 నుంచి 5 రోజుల పాటు ఇలా చేస్తే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది.

2. బొప్పాయి చెట్టు కాండానికి గాటు పెడితే అందులోంచి పాలు వ‌స్తాయి. ఆ పాల‌ను తీసుకుని చ‌ర్మంపై రాస్తే తామ‌ర‌, గ‌జ్జి వంటి చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

3. బొప్పాయి కాండం పాల‌ను 60 చుక్క‌ల మోతాదులో తీసుకుని దానికి స‌మాన భాగంలో చ‌క్కెర క‌లిపి 3 పూట‌లా తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు పోతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం కూడా త‌గ్గుతుంది.

4. బొప్పాయి పాల‌ను ఒక టీస్పూన్ మోతాదులో నిత్యం తాగుతుంటే దాంతో లివ‌ర్ శుభ్ర ప‌డుతుంది. పెరిగిన ప్లీహం, లివ‌ర్ మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి వ‌స్తాయి.

5. బొప్పాయి ప‌చ్చికాయ‌కు గాటు పెడితే దాంట్లో నుంచి పాలు వ‌స్తాయి. వాటిని ఒక పాత్ర‌లో సేక‌రించి ఆ పాత్ర‌ను బాగా కాల్చిన ఇసుక‌పై ఉంచాలి. దీంతో ఆ పాలు తెల్ల‌ని చూర్ణంలా మారుతాయి. ఈ చూర్ణాన్ని రోజుకు 2 సార్లు చిటికెడు మోతాదులో చ‌క్కెర లేదా పాల‌తో తింటే అమిత‌మైన జీర్ణ‌శక్తి క‌లుగుతుంది.

6. తేలు కుట్టిన చోట బొప్పాయి కాండం పాలు రాస్తే తేలు విషం హ‌రించుకుపోతుంది.

7. బాలింత‌లు బొప్పాయి ప‌చ్చికాయ‌ను వండుకుని తింటుంటే వారిలో పాలు బాగా ప‌డ‌తాయి.

8. బొప్పాయి ఆకును బాగా నూరి పేస్ట్‌లా చేసి క‌డితే బోద‌కాలు త‌గ్గిపోతుంది.

9. ఉడుకుతున్న మాంసంలో బొప్పాయి కాయ ముక్క‌ల‌ను వేస్తే ఆ మాంసం త్వ‌ర‌గా ఉడ‌క‌డ‌మే కాదు, బాగా మెత్త‌గా కూడా మారుతుంది.

10. బొప్పాయి పండును 2, 3 నిలువు ముక్క‌లుగా క‌ట్ చేసి రోజూ తింటుంటే మొల‌లు త‌గ్గిపోతాయి.

11. కొంద‌రికి చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ పేలి, ప‌గులుతూ ఉంటుంది. అలాంటి వారు కొంత బొప్పాయి పండు గుజ్జును స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే దాని నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

గ‌మ‌నిక‌: బొప్పాయి పండును ఎక్కువ‌గా తిన‌కూడ‌దు. ఎందుకంటే ఈ పండు జీర్ణం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. దీంతోపాటు వాతం, క‌ఫం కూడా పెరుగుతాయి. అదేవిధంగా గ‌ర్భిణీలు బొప్పాయిని ఏ రూపంలోనూ వాడ‌కూడ‌దు. దీంతో అబార్ష‌న్ అయ్యేందుకు చాన్స్ ఉంటుంది. బొప్పాయి పండును ఎక్కువ‌గా తింటే జ్వ‌రం వ‌స్తుంది. కాబ‌ట్టి ఈ పండును నిర్దేశిత మోతాదులో మాత్ర‌మే తినాలి. ఒక వేళ బొప్పాయి పండును ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల పైన చెప్పిన ల‌క్ష‌ణాలు, అనారోగ్యం క‌లిగితే అందుకు విరుగుడుగా శొంఠి లేదా పిప్ప‌ళ్లు లేదా మిరియాల చూర్ణం, క‌షాయం తీసుకుంటే స‌రిపోతుంది.

Comments

comments

Share this post

scroll to top