పానీపూరి అమ్మేవాడికి అర్జెంట్ గా మూత్రం వస్తుంది.? ఆ టైమ్ లో ఏం చేశాడో చూడండి.

సాయంత్రం చల్లగాలి వీస్తోంది, వేడివేడిగా బజ్జీలు లేదా కమ్మకమ్మగా పానీపూరి తినాలనిపిస్తుంది. మంచి టేస్ట్ ఉంటుంది కదా అని, పానీపూరికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పానీపూరి తినడానికి వెళ్తాం. అక్కడ పావ్ బాజీ, పానీపూరి, మసాలాపూరి.. ఇలా ఇష్టంగా మనకు నచ్చినవి తినేసి వస్తాం. ఈ పానీపూరిలు ఎక్కడ ఎలా తయారుచేస్తారో, ఎటువంటి చోటు అవి అమ్ముతున్నారో మనం చూస్తున్నాం. అయితే తాజాగా పానీపూరి అమ్మేవారు చేస్తున్న ఓ పెద్ద ఘనకార్యం చూస్తే ఇక జీవితంలో పానీపూరి పేరు అనడానికి వణికిపోతారు, ఆ పేరు వింటేనే మీరు వాంతులు చేసుకుంటారు.

ఎప్పటిలాగే తన పానీపూరి బండిని ఒక కాలనీలో పెట్టుకున్నాడు పానీపూరి విక్రయించే వ్యక్తి. కస్టమర్స్ వస్తూ తమకు కావలసిన పదార్థాలు తినేసి వెళ్తున్నారు. అయితే చాలాసేపటి నుండి మూత్రం వస్తున్నా ఆపుకొని మరీ పనిచేశాడో లేక ఎవరైనా తన బండిని ఎత్తుకు వెళ్తారనుకున్నాడో గానీ, తన బండిపై పానీపూరి తినడానికి వచ్చిన వారికి దాహం వేస్తే తాగడానికి ఒక డ్రమ్ము నీరు, ఒక చెంబు ఉంచాడు. తనకు మూత్రం(పాస్)అర్జెంట్ కావడంతో మొదట లుంగీ ఎత్తి అక్కడే పోద్దామని ఫిక్స్ అయ్యాడు, ఏమనిపించిందో ఏమోగానీ అక్కడ పోస్తే తెలిసిపోతుందనుకున్నాడు కాబోలు, పక్కనే ఉన్న చెంబులో మూత్రం పోశాడు. ఆ పని పూర్తయ్యేవరకు తనని ఎవరైనా చూస్తున్నారా లేదా అని దొంగచూపులు చూస్తూ ఉన్నాడు. పని పూర్తికాగానే అటు ఇటు చూసి ఎవరూ చూడకపోవడంతో అటు పక్కగా పడేశాడు. అంతలో కస్టమర్ వచ్చి అన్నా పానీపూరి ఇవ్వవా అనగానే ఆ చెంబును పాత్రపై పెట్టి,చేతులు కడుక్కోకుండానే పానీపూరి ఇచ్చాడు.
మాటలతో చెప్పలేని ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఇలా నీచంగా అమ్ముతున్న వీళ్ళను ఏమనాలి? వీళ్ళు చేస్తున్నదానికి పనిష్మెంట్ ఏంటి? ఈ ఉదంతాన్ని మొత్తం అపార్ట్ మెంట్ లో ఆ బండికి ఎదురుగా నివసిస్తున్న వారు రికార్డ్ చేశారు. పానీపూరి తినడానికి వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top