“ఇవాంకా” హైదరాబాద్ లో స్టే చేసిన హోటల్ లో…ఓ మహిళకు టిప్ ఎంత ఇచ్చిందో తెలుసా.? ఎందుకంటే..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ చాలా తక్కువ టైంలోనే అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదీ ముఖ్యంగా ఇండియాలో. ఆమొ మొన్నా మధ్యే హైదరాబాద్‌ లో జరిగిన గ్లోబల్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) 2017 సదస్సులో పాల్గొని ప్రసంగించారు. అయితే ఇవాంకా హైదరాబాద్‌ రాక కోసం ఇక్కడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట ఆమె బస వెస్టిన్‌ హోటల్‌లో ఉంటుందని అనుకున్నారు. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల దాన్ని ట్రైడెంట్‌ హోటల్‌కు మార్చారు. దీంతో ఇవాంకా సదస్సు కోసం హైదరాబాద్‌కు వచ్చీ రాగానే శంషాబాద్‌ నుంచి నేరుగా ట్రైడెంట్‌ హోటల్‌కు వెళ్లింది.

ట్రైడెంట్‌ హోటల్‌లో ఇవాంకాకు సకల మర్యాదలు చేశారు. ఆమె ఎన్నడూ రాని స్పెషల్‌ అతిథి కనుక హోటల్‌ వారు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నారు. ముఖ్యంగా ఆమెకు సదుపాయాల విషయంలో ఎలాంటి లోటు రానీయకుండా చూసుకున్నారు. అయితే జీఈఎస్‌ సదస్సులో భాగంగా ఇవాంకా రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉంది కదా. చివరకు ట్రైడెంట్‌ హోటల్‌ నుంచి వెళ్లేటప్పుడు తనకు సర్వీస్‌ చేసిన అక్కడి హోటల్‌ సిబ్బంది ఒక మహిళకు ఇవాంకా భారీ మొత్తంలో టిప్‌ ఇచ్చిందట.

రెండు రోజుల పాటు తనకు అందించన సేవలు నచ్చడంతో ఇవాంకా ట్రైడెంట్‌ హోటల్‌లో పనిచేసే ఓ మహిళకు ఏకంగా 15వేల అమెరికన్‌ డాలర్లు (దాదాపుగా మన కరెన్సీలో రూ.9.65 లక్షలు) టిప్ గా ఇవాంకా ఇచ్చిందట. అయితే ఆ మహిళకు సాధారణంగా నెలకు రూ.10వేల జీతం వస్తుందట. ఈ క్రమంలో ఇవాంకా ఇచ్చిన టిప్‌తో ఆ మహిళ జీవితమే మారిపోయిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. అవును మరి, పెద్ద వాళ్లు కదా, వారికి నచ్చితే అలాగే ప్రవర్తిస్తారు. నచ్చకపోతే అథః పాతాళానికి తొక్కేస్తారు. ఎంతైనా మంచి సౌండ్‌ పార్టీలు కదా. ఎంతైనా టిప్‌ ఇస్తారు. ఏమైనా చేస్తారు..!

Comments

comments

Share this post

scroll to top