“హార్దిక్ పాండ్య” గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? టీం లోకి ఎలా వచ్చాడు అంటే..!

హార్దిక్ పాండ్యా. భారత క్రికెట్ జట్టులో ఇతను ఇప్పుడు ఓ స్టార్. మొన్నా మధ్య జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో వేగవంతమైన అర్థ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా 32 బంతులకు 50 పరుగులు చేయడం ఆకట్టుకుంది. అయితే దురదృష్టవశాత్తూ అతను రనౌట్ అయ్యాడు. కానీ… దేశంలో ఎంతో మంది అభిమానులను సంపదించాడు. ఈ క్రమంలో పాండ్యా గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హార్దిక్ పాండ్యాది గుజరాత్‌లోని సూరత్ ప్రాంతం. ఇతనికి కృణాల్ పాండ్యా అనే సోదరుడు ఉన్నాడు. అయితే పాండ్యా 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. చిన్నప్పుడు పాండ్యా తండ్రి పాండ్యాను కిరణ్ మూరే క్రికెట్ అకాడమీలో చేర్పించడానికి వెళ్లగా, వయస్సు తక్కువుందని అందులోకి పాండ్యాను తీసుకోలేదు. కానీ పాండ్యా చూపిన ప్రతిభతో రూల్స్‌కు వ్యతిరేకంగా అతన్ని కోచింగ్ అకాడమీలోకి తీసుకున్నారు. ఆ తరువాత ఇక పాండ్యా దిన దిన ప్రవర్థమానం అన్నట్టుగా ఎదిగాడు.

2015వ సంవత్సరం పాండ్యాకు బాగా కలసి వచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఆ ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున ఓ మ్యాచ్‌లో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అంతేకాదు, మరో మ్యాచ్‌లో సిక్సర్ల మీద సిక్సర్లు బాది మోస్ట్ సిక్సెస్ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతను 2016 ఆసియా కప్‌లో భారత్ తరఫున ఆడాడు. తరువాత జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ20లోనూ ఆడాడు. ఇక తాజాగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. ఇటీవలే పాండ్యా తన చిన్నప్పటి ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు..!

Comments

comments

Share this post

scroll to top