న్యూ ఇయర్ కి జియో బంపర్ ఆఫర్…ఇక నెట్ వాడే వాళ్ళకి పండగే పండగ..!

టెలికాం రంగంలో సంచలనంలా దూసుకువచ్చింది జియో..ఉచిత వాయిస్ కాల్స్,అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించి తక్కువకాలంలోనే వినియోగదారుల ఆకర్షనను సొంతం చేసుకుంది..ఇప్పుడు కొన్ని కోట్ల మంది జియో కస్టమర్లున్నారు.ప్రారంభంలో ఆరునెలలపాటు ఉచిత సేవలందించిన జియో న్యూ  ఇయర్ కి మరో ఆఫర్ తో వినియోగదారుల ముందుకు తిసుకొచ్చింది..

హ్యాపీ న్యూఇయర్‌ 2018 స్కీమ్‌ కింద రెండు సరికొత్త ప్లాన్లను లాంచ్‌ చేసింది జియో.తక్కువ డబ్బులు – ఎక్కువ డేటా నినాదంతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

  • ఒకటి రూ.199 ప్లాన్‌. ఈ ప్లాన్ లో ప్రతి రోజు 1.2GB డేటాను 4G స్పీడ్ లో ఇస్తుంది. లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితం. అన్ లిమిటెడ్ గా కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్ ద్వారా అన్ లిమిటెడ్ మెసేజ్ లు పంపుకోవచ్చు. జియో చాట్, సినిమాలను కూడా ఈ ప్యాకేజ్ కింద వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు. న్యూ ఇయర్ సందర్భంగా రూ.199 ప్లాన్ ను తీసుకొచ్చింది జియో. డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.

  • ఎక్కువ డేటా వాడే వారికోసం రూ.299తో మరో ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద ఫ్రీ వాయిస్‌, అన్ లిమిటెడ్ డేటా(రోజుకు 2GB హైస్పీడ్‌ 4జీ డేటా), అన్ లిమిటెడ్ SMS ,జియో ప్రైమ్‌ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది.

Comments

comments

Share this post

scroll to top