వినియోగ‌దారుల‌కు జియో అందిస్తున్న పండుగ బంప‌ర్ ఆఫ‌ర్ ఏమిటో తెలుసా..?

రిల‌య‌న్స్ జియో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వినియోగ‌దారుల‌కు ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు వస్తున్నాయి. మొద‌ట వెల్‌క‌మ్ ఆఫ‌ర్, త‌రువాత హ్యాపీ న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్‌, అనంత‌రం స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌.. ఆ త‌రువాత ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్‌. ఇలా అనేక ఆఫ‌ర్ల‌ను జియో అందించింది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లే జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. రూ.1500 కే దాన్ని వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. 3 ఏళ్ల పాటు ఫోన్ వాడితే యూజ‌ర్ల‌కు అనంత‌రం డిపాజిట్ ఫీజు రూ.1500 ను తిరిగిచ్చేస్తారు. అయితే కేవ‌లం ఇవే కాదు, మ‌రో ఆఫ‌ర్‌ను కూడా జియో తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. అదేమిటంటే…

జియో ఫై హాట్ స్పాట్ డివైస్ ఉంది క‌దా. అదేనండీ జియో డాంగిల్‌. దాంతో 10 డివైస్‌ల‌కు వైఫై హాట్‌స్పాట్ క‌నెక్ష‌న్ ఇచ్చుకోవ‌చ్చు. 4జీ హైస్పీడ్ డేటాను ఆస్వాదించ‌వ‌చ్చు. దీంతోపాటు 4జీ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చు. అయితే ఈ డివైస్ జియో సిమ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అందుబాటులో ఉంది. కానీ ఇది ఇంత‌కు ముందు వ‌ర‌కు రూ.1,999 కు ల‌భించేది. అయితే ఇప్పుడు ద‌స‌రా, దీపావ‌ళి పండుగ సందర్భంగా జియో దీని రేటును భారీగా త‌గ్గించింది. రూ.1000 త‌గ్గింపుతో ప్ర‌స్తుతం ఈ డివైస్ ల‌భిస్తోంది.

వినియోగ‌దారులు ప్ర‌స్తుతం జియో ఫై డివైస్‌ను కేవ‌లం రూ.999 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఇది కొనుగోలు చేశాక జియో సిమ్ లాగే ఏదైనా ఒక ప్లాన్‌ను వేసుకుని దాంతో 4జీ హై స్పీడ్ డేటా, 4జీ వాయిస్ కాల్స్ ఆస్వాదించ‌వ‌చ్చు. అయితే ఈ ఆఫ‌ర్ ప‌ర్మినెంట్ కాదు సుమా. కేవ‌లం ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. క‌నుక గ‌డువు ముగిసే లోపే త్వ‌ర ప‌డండి మ‌రి.

Comments

comments

Share this post

scroll to top