టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్. ఆటగాడి కంటే కూడా ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాడు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అయితే జనాలు కైఫ్‌ను ఆట ఆడేసుకుంటున్నారు. మొన్నీ మధ్యే రోహిత్ శర్మ టీ20 సెంచరీపై కామెంట్లు చేసి అభాసుపాలయ్యాడు. అది మరువక ముందే మరో ఘటనతో వివాదంలో ఇరుక్కున్నాడు. అదేమిటంటే.. కైఫ్ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడమే. అవును, అదే. కైఫ్ ముస్లిం కనుక అతను క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
మాజీ క్రికెట్ ఆటగాడు మహ్మద్ కైఫ్.. పేరుకు ముస్లిమే అయినా అన్ని మతాలనూ సమానంగా చూసే వ్యక్తిగా ఇతను పేరుగాంచాడు. ఏ మతాన్నయినా ఒకేలా చూడాలని కైఫ్ అంటాడు. అయితే ఇదే ఈ మాజీ క్రికెటర్‌ను తరచూ చిక్కుల్లో పడేస్తోంది. అసలే పట్టింపులు ఎక్కువగా ఉండే ఇస్లాం మతంలో కైఫ్ చేసే పనులు చూసి చాలా మంది తిడుతుంటారు. క్రికెటర్‌గా అతనికి ఎంతో మంది అభిమానులు ఉన్నా అతని తిట్టే వారు కూడా ఇప్పుడు పెరిగిపోయారు.
సోషల్ మీడియాలో కైఫ్‌ను ఫాలో అయ్యేవారిలో ముస్లింలు కూడా చాలానే ఉన్నారు. వాళ్లంతా కైఫ్ చేసే పనులను విమర్శిస్తుంటారు. తాజాగా ఇంట్లో క్రిస్మస్ వేడుకలను చేసుకున్న ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు కైఫ్. ఇది చూసి ఫ్యాన్స్‌కు మండిపోయింది. నువ్వసలు ముస్లింవేనా అన్న రేంజ్లో కైఫ్‌తో ఆడుకున్నారు. కైఫ్‌ను ఇలా ఆడిపోసుకోవడం ఫ్యాన్స్కిదేమీ కొత్త కాదు. గతంలో సూర్య నమస్కారాలు చేశాడని, కొడుకుతో కలసి చెస్ ఆడాడని తిట్ల దండకం అందుకున్నారు. ఇవి ఇస్లాంకు విరుద్ధమన్నది అభిమానుల భావన. దీంతో వారు ఇప్పుడు కైఫ్‌పై మండి పడుతున్నారు. కైఫ్ చేసిన పని సరి కాదని అంటున్నారు..!