ఒక లీటర్ “పాము విషం” ఖరీదు 27 లక్షలు..అదే “తేలు విషం” అయితే 26 కోట్లు.! ఎందుకంత ఖరీదో తెలుసా.?

పాము, తేలు.. రెండూ విష పూరిత జీవులే. పాముల విషం ప్రాణాల‌ను తీస్తుంది. కానీ అన్ని పాములకు విషం ఉండ‌దు. కొన్ని విషం లేని పాములు ఉంటాయి. కొన్ని పాముల విషం అయితే చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది. ఇక తేలు విష‌యానికి వ‌స్తే దీని విషం అంత‌గా ప్ర‌మాదక‌రం కాదు. కానీ మ‌నుషుల‌ను కుట్టి చంప‌గ‌లిగే తేలు జాతులు కూడా కొన్ని ఉన్నాయి. అయితే మీకు తెలుసా..? తేలు విషం పాము క‌న్నా ప్ర‌మాద‌క‌రం కాదు, కానీ దాని ఖ‌రీదు మాత్రం చాలా ఎక్కువే..? ఎంతో తెలిస్తే మీరు నోరెళ్ల బెడ‌తారు..!

ఒక లీట‌ర్ తేలు విషం ఖ‌రీదు అక్ష‌రాలా రూ.26 కోట్లు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ముందే చెప్పాం క‌దా, షాక‌వుతార‌ని. ఇక ఒక లీట‌ర్ పాము విషం ఎంత ఉంటుందో తెలుసా..? అక్ష‌రాలా రూ.27 ల‌క్ష‌లు. ఈ క్ర‌మంలోనే పాము విషం క‌న్నా దాదాపుగా 130 రెట్లు ఎక్కువ ఖ‌రీదును తేలు విషం క‌లిగి ఉంటుంది. ఎందుకంటే తేలు విషం మ‌న‌కు క‌లిగే ఎన్నో ప్రాణాంత‌క వ్యాధుల‌కు మందుగా ప‌నిచేస్తుంది. తేలు విషంలో ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గిస్తాయి. పేగు వ్యాధుల‌ను న‌యం చేస్తాయి. దీంతోపాటు క్యాన్స‌ర్ చికిత్స కోసం వాడే మందుల‌ను కూడా తేలు విషంతోనే త‌యారు చేస్తారు. మీరు న‌మ్మ‌లేకున్నా ఇది నిజ‌మే.

అయితే మ‌నుషుల‌ని కుట్టి చంపేంత ప‌వ‌ర్‌ఫుల్ విషం ఉన్న తేలు జాతులు ప్ర‌పంచ వ్యాప్తంగా 25 ర‌కాలు ఉన్నాయి. వీటి విషం ఇంకా ఖ‌రీదైంది. ఇక పాము విషానికి వ‌స్తే ఇందులోనూ ఖ‌రీదైన పాము విషాలు ఉన్నాయి. కింగ్ కోబ్రా విషం ఖ‌రీదు తేలు విషం ఖ‌రీదుకు స‌మానంగా ఉంటుంది. కింగ్ కోబ్రాకు చెందిన ఒక లీట‌ర్ విషం ధ‌ర దాదాపుగా రూ.20 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. పాము విషంతో కూడా మెడిసిన్స్‌, కాస్మొటిక్స్ త‌యారు చేస్తారు. కాగా హార్‌లోని పూర్నియా ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపు 900 గ్రాముల బరువైన పాము విషాన్ని ఇటీవ‌లే స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దాని విలువ అక్షరాలా రూ.20 కోట్ల రూపాయలట! ఇద్దరు వ్యక్తులు దీన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లను పట్టుకుని ఈ విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ విషం మూడు బాటిల్స్‌లో ఉంద‌ట‌. ఒక్క బాటిల్లో ఉన్న ఈ విషం ఏకంగా రూ.3 కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుసుకున్న అధికారులు షాక్‌కు గుర‌య్యారు. అవును మ‌రి, వారే కాదు, మ‌నం కూడా పాము, తేలు విషాల ఖ‌రీదు తెలిసి షాక్‌కు గురయ్యాం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top