పాము పగపడుతుందా? కొట్టిన పామును చంపకుండా వదిలేస్తే..అది మనను వెంటాడుతుందా?

పామును చంపే సమయంలో దాని మీద దెబ్బ పడ్డ తర్వాత…అది తప్పించుకుపోతే…అది మిమ్మల్ని పగబడుతుందా? మీరు కొట్టే సమయంలో ఆ పాము తన మెమొరీలో మీ ఫోటోను సేవ్ చేసుకొని.. తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందా? అంటే… అవుననే అంటారు మన పెద్దలు. పాము పగ అని ఓ జాతీయాన్నే వాడుతుంటారు. అయితే సైన్స్ ప్రకారం పాము పగపడుతుందా? ఎన్ని రోజులైనా పాము తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా? అనే విషయాన్ని కాస్త కాన్సంట్రేషన్ ను పెట్టి పరిశీలిస్తే….ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయ్.

నిజమేంటంటే…. పాముకు అసలు మెమొరీనే ఉండదట…అలాంటప్పుడు పాము మనల్ని  గుర్తు పెట్టుకునే ఛాన్స్…పగపట్టే ఛాన్స్ అసలు ఉండనే ఉండదట.! ఇదంతా మనవాళ్లు కల్పించిన ఓ నమ్మకం మాత్రమేనట.!  అయితే దీని వెనుక కూడా ఓ కారణం ఉందనే అంటారు చాలామంది.

Kingcobra-kollegekalatas

అప్పట్లో రైతుల ప్రధాన వృత్తి వ్యవసాయం. పండించిన పంటలకు ఎలుకల నుండి తీవ్ర నష్టం వాటిల్లేదట. కాబట్టి  కనపడిన పామును కనపడినట్టు చంపడం ద్వారా…. ఎలుకలను తినే పాముల సంఖ్య తగ్గడంతో…ఎలుకలు విపరీతంగా పెరగడం.. పంటలకు ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లడం లాంటివి అవుతాయని..ముందస్తుగా పాములను చంపొద్దు, ఒక వేళ మిస్ అయితే అవి పగబడతాయి అనే భయాన్ని క్రియేట్ చేసారట.!  పురాతాన జనాలు  పాము ను దేవతగా కొలవడం, ప్రకృతి ప్రేమికులు కావడం కూడా దీని వెనుకున్న అసలు కారణాలట.!

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top