బుర్ఖాలో వచ్చిన ఓమహిళ సెక్యురిటీ గార్డ్ మీద కత్తితో దాడి చేసింది.!

బుర్ఖాలో వచ్చిన ఓమహిళ సెక్యురిటీ గార్డ్ మీద కత్తితో దాడి చేసింది.! ఆ దాడి దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయ్..ఈ దాడి నుండి సెక్యురిటీ గార్డ్ తప్పించుకున్నాడు. అయితే  ఈ దాడి ఇప్పుడు రెండు దేశాల మద్య మాటల యుద్దానికి తెరతీసింది. ముందుమందు ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో అనేదే అసలు సమస్య? ఎందుకంటే సెక్యురిటీ గార్డ్ ది ఇజ్రాయిల్, అతనిపై దాడి చేసిన మహిళది పాలస్తీన. ఇప్పటికే ఇరుదేశాల మద్య ప్రఛ్చన్న యుద్దం కొనసాగుతున్న తరుణంలో ఈ దాడి ఎటు వెళుతుందో అనే దిశగా చర్చలు ప్రారంభమయ్యాయ్. ఇజ్రాయిల్‌లోని బైటర్‌ ఇల్లిట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్ ప్రభుత్వం భద్రతను పెంచింది…అనుమానాస్పద వ్యక్తలను గురించిన సమాచారం అందించాలని ఇజ్రాయిల్ ప్రజలకు సందేశం ఇచ్చింది.

Watch Video 🙁 Lady Attack On Security Guard)

 

 అసలు చరిత్ర ఏం చెబుతోంది:

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రధానాంగమైన భద్రతాసమితి తీర్మానం మేరకు పాలస్తీనా దేశంలోని కొంత భూభాగంలో ఇజ్రాయెల్ అనే రాజ్యం ఏర్పాటైంది. అయితే ఆ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న అరబ్‌లు (పాలస్తీనియన్లు) దీన్ని వ్యతిరేకించారు. దాని పరిణామమే ఇజ్రాయెల్, పొరుగు అరబ్ దేశాల మధ్య యుద్ధానికి దారీతీసింది.1967లో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది.
1973లో తిరిగి అరబ్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం సంభవించింది.  అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్ (అమెరికా ఇజ్రాయెల్ వైపు-రష్యా పాలస్తీనా వైపు) ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాయి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top