పాల‌లో నిద్ర‌మాత్రలు క‌లిపి 17 ఏళ్ల త‌న కూతురికి ఇచ్చాడు…తర్వాత ఏమైందో తెలుస్తే మీకు కోపమొస్తుంది..!

స‌మాజంలో రోజు రోజుకీ మ‌హిళ‌ల‌కు ర‌క్షణ లేకుండా పోతుంద‌ని మ‌నం దిగులు చెందుతున్నాం. అయితే నిజానికి స‌మాజంలోనే కాదు, సొంత కుటుంబాల్లోనే వారికి ర‌క్ష‌ణ క‌రువ‌వుతోంది. వావి వ‌రుస మ‌రిచిన మృగాళ్లు మ‌న మ‌ధ్య‌నే సంచ‌రిస్తూ త‌ల్లి, పిల్ల అని చూడ‌కుండా అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో తాజాగా ఇలాంటిదే ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్ప‌డ్డాడు ఓ తండ్రి. దీంతో పోలీసులు అత‌న్ని అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు.

అది ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బులంద్ ష‌హ‌ర్ భోపూర్ గ్రామం. అక్క‌డ నివాసం ఉండే 17 ఏళ్ల యువ‌తిపై క‌న్నేశాడు ఆమె తండ్రి. ఆమె త‌ల్లి ఇంట్లో లేని స‌మ‌యం చూసి అత‌ను పాలలో నిద్ర మాత్ర‌లు క‌లిపి త‌న కూతురికి ఇచ్చాడు.ఇది తెలియ‌ని ఆమె పాలు తాగి స్పృహ త‌ప్పింది. దీంతో ఆమెపై అత్యాచారం చేశాడు ఆమె తండ్రి. ఈ దారుణ‌మైన సంఘ‌ట‌న‌తో చుట్టు పక్క‌ల వారు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

కాగా ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన స‌ద‌రు ప్ర‌బుద్ధున్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం అత‌ను జైలులో ఉన్నాడు. నిజంగా మీరే చెప్పండి, ఇలాంటి వారిని ఏం చేయాలో..! మ‌న చ‌ట్టాలు ఇంకా క‌ఠినంగా ఉండాల‌న్న విష‌యాన్ని ఇలాంటి ఘ‌ట‌న‌లు చాటి చెబుతున్నాయి. మ‌రి ప్ర‌భుత్వాలు, నాయ‌కులు ఇంకా ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి. ఈ ఘ‌ట‌న‌ల ప‌ట్ల ఇప్ప‌టికైనా స్పందించ‌క‌పోతే ఇక మ‌హిళ‌ల‌కు త‌మ త‌మ ఇండ్ల‌లోనే ఇలాంటి మృగాళ్ల బారి నుంచి ర‌క్ష‌ణ ల‌భించ‌దు గాక లభించ‌దు. మరి ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు స్పందిస్తాయా..? చూద్దాం..!

Comments

comments

Share this post

scroll to top