ప‌క్షులు గుంపుగా V ఆకారంలోనే ఎగురుతుంటాయి..ఎందుకో తెలుసా? చాలా పెద్ద సైన్స్ ఉంది దీని వెనుక‌.!

అప్పుడ‌ప్పుడు ఆకాశంలో ప‌క్షులు గుంపులు గుంపులుగా ఎగ‌రడాన్ని గ‌మ‌నించే ఉంటారు.! వాటిని ప‌రీక్షించి చూస్తే ఓ విష‌యం అర్థ‌మౌతుంది అవ‌న్నీ V ఆకారంలో ఎగురుతుంటాయి.! ఇలానే ఎందుకు అనే డౌట్ మీకెప్పుడైనా వ‌చ్చిందా? ఆ డౌట్ మీకు వ‌చ్చుంటే ఇదిగో స‌మాధానం.

వాస్త‌వానికి వ‌ల‌స ప‌క్షులు V షేప్ లోకి ఫామ్ అయ్యి ప్ర‌యాణం చేస్తుంటాయి. దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజ‌న్ ఉంది. సాధార‌ణంగా ప‌క్షులు ఎగ‌రాలంటే దాని బ‌రువు+ గాలి వేగాన్ని అధిగ‌మిస్తూ రెక్క‌ల స‌హాయంతో ప్ర‌యాణించాల్సి ఉంటుంది.! కొద్ది దూరం ప్ర‌యాణానికైతే ఓ ప‌క్షి సింగిల్ గా ప్ర‌యాణించ‌వ‌చ్చు, కానీ వ‌ల‌స వెళ్లే సంద‌ర్భంలో వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాలి కాబ‌ట్టి గుంపులుగా మాత్ర‌మే ప్ర‌యాణించాలి, అది కూడా V షేప్ లోకి ఫామ్ అయ్యే ప్ర‌యాణించాలి.

 

ఇలా V షేప్ లో ప్ర‌యాణించ‌డం వ‌ల్ల ప‌క్షుల‌కు ఎదురుగా వీచే గాలి ఒత్తిడి… ఒక్కొక్క ప‌క్షి మీద కాకుండా ఆ ఒత్తిడి అన్ని ప‌క్షుల మీద‌కు స్ల్పిట్ అవుతుంది.! దాంతో గాలిని నిరోధించ‌డానికి ప‌క్షులు సింగిల్ గా ప్ర‌యానించేట‌ప్పుడు ఉప‌యోగించే సామ‌ర్థ్యంతో పోల్చితే త‌క్కువ సామర్థ్యాన్ని ఉప‌యోగిస్తే స‌రిపోతుంది. దీని కార‌ణంగా ఎన‌ర్జీని సేవ్ చేసుకోవొచ్చు.! సాధార‌ణంగా ప‌క్షులు గంట‌కు 100 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించ‌గ‌ల్గితే…ఇలా V షేప్ లోకి ఫామ్ అయ్యి ప్ర‌యానం చేయ‌డం కార‌ణంగా గంట‌కు 171 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించ‌వొచ్చు.!

 

ఇంతే కాదు ప‌క్షుల్లో గ‌మ‌నించాల్సిన ఇంకో మంచి విష‌యం కూడా ఉంది. V ఆకారంలోకి ప్ర‌యాణించేట‌ప్పుడు మొద‌టి స్థానంలో ఉండే ప‌క్షి మిగితా ప‌క్షుల‌తో పోల్చితే ఎక్కువ గాలి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందుకే కొద్దిదూరం ప్ర‌యాణించాక‌…వేరొక ప‌క్షి ఆ స్థానంలో కి వ‌స్తుంది..ఇలా ప‌క్షులు త‌మ త‌మ స్థానాలు మార్చుకుంటూ, త‌మ ఎన‌ర్జీని సేవ్ చేసుకుంటూ సుదూర ప్ర‌యాణాలు చేస్తాయి.!

ఇదే స్ట్రాట‌జీ… యుద్ద విమానాలు, విన్యాసాలు చేసే విమానాలు ఫాలో అవుతాయి. దీని కార‌ణంగా త‌క్కువ ఇంద‌నం ఖ‌ర్చవుతుంది.!

Comments

comments

Share this post

scroll to top