పాక్‌లో యుద్ధ విమానాల రిహార్స‌ల్స్‌… ఎవ‌రిని బెదిరించ‌డానికి మీ డాంబికాలు..?

జమ్మూ కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో గ‌త కొద్ది రోజుల క్రితం జ‌రిగిన దారుణ సంఘ‌ట‌న గురించి అంద‌రికీ తెలిసిందే. ఆ దాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల కాల్పుల‌కు మ‌న భార‌త జ‌వాన్లు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం యావ‌త్తూ ఈ సంఘ‌ట‌న‌ను ఖండించింది. పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తుంద‌ని, ఆ దేశం ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా మారింద‌ని, వెంట‌నే వారి చ‌ర్య‌లకు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని దేశం మొత్తం గ‌ళ‌మెత్తి చాటింది. అయితే నిజానికి భార‌త్ గ‌న‌క వెంట‌నే స్పందించి సై అంట్ సై అని ముందుకు దూకి ఉంటే ఈ పాటికి పెద్ద యుద్ధ‌మే వ‌చ్చి ఉండేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. కాక‌పోతే స‌రిహ‌ద్దుల్లో మ‌న సైనికులు కూంబింగ్ ఆప‌రేష‌న్లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆయా ప్రాంతాల్లో న‌క్కి ఉన్న ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టేందుకు ముమ్మ‌ర గాలింపు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే కొంద‌రు మన ఆర్మీ అధికారుల‌కు చిక్కారు కూడా. వారిని ఎన్‌కౌంట‌ర్ చేసి అక్క‌డే హ‌త‌మార్చారు. అయినా భార‌త సైనికుల ఆప‌రేష‌న్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలో భార‌త్ పాక్‌తో యుద్ధానికి దిగ‌డం మాట అటుంచితే, ఇప్పుడు పాకిస్థానే క‌య్యానికి కాలు దువ్విన‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తోంది. అందుకు ప్ర‌స్తుతం అక్క‌డి ఇస్లామాబాద్ న‌గ‌రంలో జ‌రుగుతున్న ఆర్మీ రిహార్స‌ల్సే ఉదాహ‌ర‌ణ‌.

f-16

ఈ నెల 22వ తేదీన రాత్రి 10.20 గంట‌ల ప్రాంతంలో పలు ఎఫ్‌-16 యుద్ధ విమానాలు ఇస్లామాబాద్‌ న‌గ‌రంపై చక్క‌ర్లు కొడుతున్నాయంటూ అక్క‌డి జియో టీవీ జ‌ర్న‌లిస్టు హ‌మీద్ మీర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. కొన్ని క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే అత‌ని ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో స్థానికంగా ఉన్న ప్ర‌జ‌లు కూడా స‌ద‌రు విమానాల‌ను చూసి భ‌యంతో లోప‌లికి వెళ్లార‌ట‌. అయితే మ‌ళ్లీ హ‌మీద్ ఏం ట్వీట్ చేశాడంటే యుద్ధ‌మంటే మ‌న పేద దేశాల‌కు అంత మంచిది కాదు, వాటిని ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. యుద్ధం రాకుండా ఉండాల‌ని ఆశిద్దాం. అంటూ మ‌రో పోస్ట్ చేశాడు.

అయితే కొంద‌రు మాత్రం స‌ద‌రు విమానాలు చ‌క్కర్లు కొడుతుండ‌డం ప‌ట్ల ఏం అంటున్నారంటే పాక్ భార‌త్‌పైకి యుద్ధానికి వెళ్తోంద‌ని, అందులో భాగంగానే ఎయిర్ ఫోర్స్‌, ఆర్మీ వారు రిహార్స‌ల్స్ చేస్తున్నారంటూ ట్వీట్లు చేశారు. అయినా వారి చాద‌స్తం గానీ, యుద్ధానికి రిహార్స‌ల్స్ చేయాలా ఎవ‌రైనా, ఆర్మీ సైనికులు అలాంటి శిక్ష‌ణ‌ను తీసుకున్న త‌రువాతే సైన్యంలో చేరి ఎల్ల‌ప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంటారు. వారికి మ‌ళ్లీ రిహార్స‌ల్స్ అవ‌స‌రం లేదు. ఎలాంటి యుద్ధం వ‌చ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు భార‌త సైన్యం ఎల్ల‌ప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కాక‌పోతే ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల ఆదేశాల కోసం మ‌న సైన్యం వేచి చూస్తున్నారు, అంతే. ఒక‌సారి ఆదేశం వ‌స్తే అప్పుడు తెలుస్తుంది, ఎవ‌రి స‌త్తా ఏంటో. అయినా ఇప్ప‌టికే మాతో చేసిన యుద్ధాల్లో ఓడిపోయి, చావు త‌ప్పి, క‌న్నులొట్ట‌పోయిన‌ట్టుగా అయింది మీ ప‌రిస్థితి. ఇక ఇప్పుడు మాతో యుద్ధం చేశారో కోలుకోవడానికి చాలా ఏళ్లు ప‌డుతుంది మరి. మా వ‌ద్ద ఉన్నన్ని క్షిప‌ణులు, ఆయుధాలు, బ‌ల‌గాలు మీ వ‌ద్ద ఉన్నాయా..? అయినా ఏం చూసుకుని ఆ రిహార్స‌ల్సూ, విన్యాసాలూ… అదే… మీలాంటి వారిని ఉద్దేశించే వెనక‌టికి ఏదో సామెత చెప్పారుగా… అదేంట‌బ్బా… ఆ… ఏమీ లేనమ్మ ఎగిరెగిరి ప‌డుతుంద‌ట‌… మేక‌పోతు గాంభీర్యం… అవును, అవే… ఇప్పుడు పాక్ అనుస‌రిస్తున్న విధానాలు స‌రిగ్గా ఇలాగే ఉన్నాయి. మీరు ఎన్ని విన్యాసాలు చేసి బెదర‌గొట్టాల‌ని చూసినా… ఇక్క‌డ ఉంది భార‌త సైన్యం… అది సింహం లాంటిది… దాని ముందు మీ డాంబికాలు, ఆట‌లు ఏమీ సాగ‌వు..!

జియో టీవీ జ‌ర్న‌లిస్టు హ‌మీద్ మీర్ చేసిన ట్వీట్ ఇదే..!

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top