ఉగ్ర‌వాదులకు అడ్డా నిజ‌మేన‌న్న పాక్ పీఎం

నిన్న‌టి దాకా చిలుక ప‌లుకులు ప‌లికిన పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎట్ట‌కేల‌కు నిజాన్ని ఒప్పుకున్నారు. గ‌త కొన్నేళ్లుగా ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన పాక్ ఉగ్ర‌వాదానికి అడ్డాగా మారి పోయింది. వారి క‌నుస‌న్న‌ల‌లోనే పాకిస్తాన్ న‌డుస్తోందంటే ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద ప్ర‌తిసారి భార‌త్ పాకిస్తాన్ చేస్తున్న నీతి మాలిన ప‌నుల గురించి ఎత్తి చూపుతూనే ఉన్న‌ది. యునైటెడ్ నేష‌న్స్ సాక్షిగా ఆధారాల‌ను సైతం ప్ర‌వేశ పెట్టింది. అయినా పాక్ పాల‌కులు ఒప్పుకోలేదు. త‌మ దేశం ప‌విత్ర‌మైన‌దంటూ చెప్పుకొచ్చారు. వాస్త‌వాధీన రేఖ‌ను దాట‌డం, చీటికి మాటికి గిల్లిక‌జ్జాలు పెట్టుకోవ‌డం అక్క‌డి పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు ష‌రా మామూలుగా మారి పోయింది. ఆపై ఆరోప‌ణ‌లు కూడా. తాజాగా అమెరికా టూర్‌లో ఉన్న ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ త‌మ దేశంలో టెర్ర‌రిస్టులు ఉన్నార‌న్న వాస్త‌వాన్ని అంగీక‌రించారు. ఇప్ప‌టికీ ఇంకా 30 వేల నుంచి 40 వేల మంది దాకా ఉన్నారంటూ బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

గ‌త ప్ర‌భుత్వాలు, ఏలిన వారు క‌ఠిన‌త‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం వ‌ల్ల‌నే వారి కార్య‌క‌లాపాలు పెచ్చ‌రిల్లి పోయాయ‌ని ఆరోపించారు. యునైటెడ్ స్టేట్స్ పీస్ ఇనిస్టిట్యూట్ లో ప్ర‌సంగించిన ఇమ్రాన్ ఖాన్ ఈ విష‌యాలు వెల్ల‌డించారు. ముష్క‌ర మూక‌లంతా ఆఫ్ట‌నిస్తాన్, కశ్మీర్ ప్రాంతాల్లో శిక్ష‌ణ పొందుతూ దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 2014లో తాలిబ‌న్లు చేసిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు కోల్పోయార‌ని, అప్పుడే దేశంలో ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఎలాంటి తావు లేకుండా చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్పారు. ఈ మేర‌కు అన్ని పార్టీలు క‌లిసి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ అమ‌లులోకి వ‌చ్చేస‌రిక‌ల్లా చిత్త‌శుద్ది లోపించింద‌న్నారు. దీని వ‌ల్ల వారు పెచ్చ‌రిల్లి పోయార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాను అధికారంలోకి వ‌చ్చాక ఉగ్ర‌వాదులు, వారి సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేసే ప‌నిలో ప‌డ్డామ‌న్నారు. ఎవ‌రినీ ఉపేక్షించ‌డం లేద‌న్నారు.

అంతేకాక దేశంలో 40 టెర్ర‌రిస్టు గ్రూపులు, సంస్థలు ఉండేవ‌ని పీఎం తెలిపారు. ఈ విష‌యంలో పాక్ ప్ర‌భుత్వం వాస్త‌వాల‌ను బహిరంగంగా తెలియ చేయ‌లేద‌ని, అమెరికాకు అబ‌ద్దాలు చెబుతూ వ‌చ్చాయ‌ని ఆరోపించారు. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా, సమాజానికి చెరుపు చేసే వ్య‌క్తులు, సంస్థ‌ల‌ను మేం ఎట్టి ప‌రిస్థితుల్లోను స‌పోర్ట్ చేసే ప్ర‌స‌క్తి లేదు. ఎవ‌రైనా శాంతిని కోరు కోవాల్సిందే. అలాగని హింస‌కు పాల్ప‌డ‌తామంటే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేదన్నారు ఇమ్రాన్‌ఖాన్. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా మేం అమెరికాతో క‌లిసి యుద్దం చేశాం. కానీ ఆనాటి ప్ర‌భుత్వాలు అస‌లు విష‌యాల‌ను దాచి ఉంచార‌ని, నిజాలు తెలియ చేయ‌క పోవ‌డం వ‌ల్ల‌నే వీరు పేట్రేగి పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భారీ ఎత్తున మోహ‌రించిన ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో ఇన్నేళ్లుగా పాకిస్తాన్ ఎలా మ‌నుగ‌డ సాధించింద‌నేది అర్థం కావ‌డం లేద‌న్నారు. ఉగ్ర‌వాదంపై యుఎస్ వార్ ప్ర‌క‌టిస్తే..పాకిస్తాన్ ఉనికి కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. రాబోయే రోజుల్లో టెర్ర‌రిజంపైనే మా అస‌లైన యుద్ధం ఎప్పుడూ కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు.

Comments

comments

Share this post

scroll to top