పాకిస్థాన్ పిల్లలు ఇండియాలోని తమ స్నేహితులకు రాసిన లేఖలు.. చిట్టిపొట్టి మాటలతో ఎక్కడో టచ్ చేశారు.!

కల్మషం లేని పిల్లలు తమ స్నేహ హస్తాన్ని చాటారు. స్నేహానికి హద్దులు లేవని తెలిపారు. తమకు ప్రేమించడమే వచ్చంటూ ప్రపంచానికి చాటిచెప్పారు. వారి చిట్టిచిట్టి చేతులతో రాసిన లేఖలే వీటికి నిదర్శనం.  పాకిస్థాన్ కు చెందిన పిల్లలు ఇండియాలోని తమ స్నేహితులకు  శుభాకాంక్షలు తెలుపుతూ, ఆత్మీయతను పంచుతూ రాసిన లేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతున్నాయి. వాస్తవానికి వీటిని సమయ్ అనే ఓ NRI సేకరించాడు. ఇతనులాస్ ఏంజిల్స్ లో సామాజిక రేడియో కార్యకర్తగా పనిచేస్తుంటాడు. ఇతర దేశంలో ఎవరైనా భారతదేశం లోని వారితో స్నేహం చేయడానికి  వచ్చిన వారి గురించి ప్రచారం చేస్తూ ఉంటాడు.

nri1

అయితే పాకిస్థాన్ లోని పెషావర్ లోని ఓ స్కూల్లో ఉగ్రవాద దాడిలో కొంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వారికి ధైర్యాన్నిస్తూ ఇండియా నుండి కొన్ని లేఖలను ఆ స్కూల్ కు పంపారు కొంతమంది.ఆపద సమయంలో తమ క్షేమాన్ని గురించి ఆరా తీస్తూ తమలో ధైర్యాన్ని నింపిన వారికి తిరిగి ఉత్తరాలు రాశారు పాక్ పిల్లలు.
nri2
  • ‘హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నావు. నువ్వు బాగున్నావని అనుకుంటున్నాను. నువ్వెప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఒకసారి పాకిస్థాన్ సందర్శించు. అందమైన నగరాన్ని మనం వీక్షిద్దాం. నా ఈ లేఖను స్వీకరించి, నాతో స్నేహం చేస్తావని ఆశిస్తున్నాను.”మునాజ్ మొహమ్మద్ రాసిన లేఖ.
  • పాకిస్థాన్,భారతీయులు ఎప్పటికీ స్నేహితులుగా ఉండాలని పాక్, భారత్ జెండాలను బొమ్మలుగా వేసిన సుమాయియా.
  • ‘మనం ఎప్పటికీ స్నేహితులమే మన స్నేహాన్ని ఎవరూ, ఎప్పటికీ విడదీయలేరు’ పాకిస్థాన్ లోని కరాచీలో 7వ తరగతి చదువుతున్న అన్మోల్ రాసినది.
  • నువ్వు ఎప్పటికీ నవ్వుతూనే ఉండు అంటూ ఖాదిజియా రాశాడు.
nri4
ఇలా పాకిస్థాన్ కు చెందిన పసి హృదయాలు, చిన్న చిన్న మాటలతో హృదయాలను హత్తుకునేలా ఎంతో గొప్పగా తమ స్నేహం గురించి తెలిపారు. ఉగ్రవాదం, తీవ్రవాదం మాకు తెలియదు తెలిసినది ఒక్క స్నేహం మాత్రమే అని చాటిచెప్పారు.

Comments

comments

Share this post

scroll to top