ఆర్మీ క్యాప్ తో మ్యాచ్ ఆడిన టీం ఇండియా పైన మండిపడుతున్న పాక్, బీసీసీఐపై చర్యలు తీసుకోవాలంటున్న పాక్..!!

ఇండియా VS ఆస్ట్రేలియా మూడవ ODI లో ఇండియన్ టీం ప్లేయర్స్ ఆర్మీ క్యాప్ ను ధరించి మ్యాచ్ ఆడారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా టీం ఇండియా ఈ క్యాప్ లను ధరించింది. ఆర్మీ క్యాప్ తో మ్యాచ్ మొత్తం ఆడటమే కాకుండా మూడో వన్డేలో తమకు దక్కిన మ్యాచ్‌ ఫీజును కూడా ఆటగాళ్లంతా జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తున్నట్టు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్‌ కోహ్లీ తెలిపాడు.

ధోనీ ముందుండి.. :

బీసీసీఐ లోగో కలిగి ఉన్న ప్రత్యేక ఆర్మీ క్యాప్స్ ను అనుచరులకు అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇండియన్ క్రికెట్ టీం ప్లేయర్స్ కు మ్యాచ్ కి ముందు క్యాప్స్ అందించాడు ధోనీ, ఆ తరువాత మైదానం లో బ్యాటింగ్ ఆడేటప్పుడు కూడా ఆర్మీ క్యాప్ ను ధరించి కొద్ది సేపు బ్యాటింగ్ చేసాడు మహేంద్ర సింగ్ ధోనీ, మ్యాచ్ చివరి వరకు ఆస్ట్రేలియా కి గట్టి పోటీ ఇచ్చింది భారత్. చివరికి ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో ఇండియా పై గెలిచింది. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా తో మ్యాచ్ సందర్బంగా ఇండియన్ ప్లేయర్స్ ఆర్మీ క్యాప్ ధరించడం పాకిస్తాన్ జనాలకు నచ్చలేదు, బీసీసీఐ పైన ఘాటుగా విమర్శలు గుప్పించారు.

ఫిర్యాదు చెయ్యాలి.. :

పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫావద్ చౌదరి ఇండియన్ ప్లేయర్స్ మ్యాచ్ లో ఆర్మీ క్యాప్ ధరించడం పైన మాట్లాడుతూ ‘బీసీసీఐ పై చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ని కోరుతున్నా, భారత జట్టు ఆర్మీ క్యాప్‌లు ధ‌రించి క్రికెట్ ఆడ‌డం స‌రికాదు, క్రికెట్‌ను రాజ‌కీయం చేస్తున్న బీసీసీఐపై అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చ‌ర్య‌లు తీసుకోవాలి. టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లు ధ‌రించిన అంశాన్ని పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయాలి’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఎవరు సర్ మీరు.. :

పాకిస్తాన్ దేశ ప్రధాని ఎవరో కూడా మనోళ్ళలో చాలా మందికి తెలీదు, అలాంటిది ఎవరో పాక్ సమాచార శాఖ మంత్రి ఏదో అన్నాడని పట్టించుంటామా, అసలు ఆయన ఎవరో వాళ్ల దేశస్థులకే తెలియకపోవచ్చు అని మన వాళ్ళు వ్యంగ్యంగా పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి పైన కామెంట్స్ చేస్తున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top