భజరంగి భాయిజాన్ కోసం ఇండియా వచ్చిన పాక్ యువతి?

భజరంగి భాయిజాన్ సినిమా చూశారా…? ఇండియాలో తప్పిపోయిన పాకిస్థాన్ కు చెందిన 6 యేళ్ల పాపను స్వదేశానికి చేర్చడానికి సల్మాన్ పడ్డ కష్టాలు.. పాస్ పోర్ట్ లేకుండా పాక్ కు  వెళ్లడం..అక్కడ అనేక సమస్యలను ఫేస్ చేయడం..అబ్బో సినిమా సీన్ టు సీన్ చాలా  ఉత్కంఠగా సాగుతోంది.  సీన్ ఒక్క సారి కట్ చేసి రియల్ లైఫ్ లోకి ఎంటరైతే అవాక్కయయే ఘటన జరిగింది పంజాబ్ లో..
పంజాబ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు పట్టుకొని ప్రశ్నించారు.. దానికి ఆ యువతి చెప్పిన సమాధానం తో ఒక్కసారిగా ఖంగు తిన్నారు మన పోలీసులు.. సల్మాన్ ఖాన్ ను కలుసుకోవడం కోసమే పాకిస్థాన్ నుండి ఇండియా వచ్చినట్టు తెలిపింది ఆ యువతి.. పాస్ పోర్ట్ ఏదని ప్రశ్నించగా లేదని సమాధానం ఇచ్చింది. సినిమా లో సల్మాన్ కూడా పాస్ పోర్ట్ లేకుండా పాక్ కు వెళతాడు.
Bajrangi-Bhaijaan1
సదరు మహిళను మరింత గట్టిగా ప్రశ్నిస్తే.. తన కొడుకు కోసం ఢిల్లీలోని దర్గాలో ప్రార్థించడానికి వచ్చానని మరో సమాధానం ఇచ్చింది. ఈ  సీన్ కూడా యాస్ ఇట్ ఈస్ భజరంగీ భాయిజాన్ సినిమాలో ఉంది. పొంతనలేని సమాధానాలు చెబుతున్న సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.. ఈ మహిళ  పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన చందాఖాన్(27)  గుర్తించారు.
సినిమాను చూసి సల్మాన్ ను కలవడానికి వచ్చిందా…? లేక మరేవైన ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు ను వేగవంతం చేశారు పోలీసులు ..ఎందుకంటే పంజాబ్ లో టెర్రరిస్ట్ ల దాడి నేపథ్యంలో ప్రతి  ఒక్కరినీ అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top