విద్యార్థినుల‌కు…4 కోడిపెట్ట‌లు, ఓ కోడిపుంజు ఇస్తున్న పాకిస్తాన్.! ఎందుకో తెలుసా??

ఇత‌ర విషయాల‌ను ప‌క్క‌కు పెడితే బాలికా విద్య‌ను ప్రోత్సాహించే క్ర‌మంలో పాకిస్తాన్ ఓ విన్నూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి ప‌టిష్టంగా అమ‌లు ప‌రుస్తుంది. 6వ త‌ర‌గ‌తి నుండి ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దివే విద్యార్థినుల‌కు పాక్ ప్ర‌భుత్వం 4 కోడిపెట్ట‌లు, ఓ కోడిపుంజు, ఓ పంజ‌రాన్ని ఇచ్చి, వాటి బాగోగుల‌ను చూస్తూ, వాటిపై ఓ రిపోర్ట్ ను త‌యారు చేసి, సంబంధిత టీచ‌ర్ కు చూపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.! దీనిని వృత్తి విద్యలో భాగం చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు అక్క‌డి విద్యాశాఖ అధికారులు.

దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం:

  • 4 కోడిపెట్టెల‌ను, ఓ కోడిపుంజును పెంచ‌డం ద్వారా…. విద్యార్థినుల‌కు ఫౌల్ట్రీ ఫామ్ మెయింటెనెన్స్ మీద ఓ ప్రాథ‌మిక అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది.ఈ నాలెడ్జ్ భ‌విష్య‌త్ లో ఆ రంగం వైపుగా వ్యాపారం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • దీనితో పాటు…ఆ కోళ్ళు పెట్టే గుడ్ల‌ను తిన‌డం ద్వారా స‌ద‌రు విద్యార్థినికి పౌష్టికాహారం ల‌భిస్తుంది.
  • మ‌రో విష‌యం ఏంటంటే… వంటిట్లో వృథా అయిన ఆహార‌ప‌దార్థాల‌ను కోళ్ళ‌కు దాణాగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల స‌హ‌జ వ‌నురుల వేస్టేజ్ ను అరిక‌ట్ట‌డం అనే అంశాన్ని కూడా నేర్చుకుంటారు.

Comments

comments

Share this post

scroll to top