పూరి – బాలయ్య “పైసా వసూల్” వసూలు చేయగలిగిందా..? హిట్టా? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Movie Title (చిత్రం): పైసా వసూల్ (Paisa Vasool )

Cast & Crew:

  • నటీనటులు: బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్, ఆలి తదితరులు
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • నిర్మాత: భవ్య క్రియేషన్స్
  • దర్శకత్వం: పూరి జగన్నాధ్

Story:

ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, మూడు పాటలు, తేడా సింగ్ డైలాగులు, పంచ్‌లతో గడిపేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో అసలు కథలోకి అడుగుపెట్టాడు దర్శకుడు. ఇంటర్వెల్ తరవాత తేడా సింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో శ్రియ ఎంట్రీ ఇచ్చింది. శ్రియాకి డాన్ బాబ్ మార్లే నుంచి ప్రమాదం వచ్చి పడుతుంది. తేడా సింగ్ ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. చివరిగా ట్విస్ట్ ఏంటంటే తేడా సింగ్ అసలు పేరు బాల. అతనో రా ఏజెంట్. డాన్‌ని చంపడానికి వస్తాడు.

Review:

పూరి జగన్నాథ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పైసా వసూల్’ సినిమా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. గురువారం అర్ధరాత్రి నుండే ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఇది బాలయ్య అభిమానులకు విందు భోజనం లాంటి సినిమా అని కువైట్ టాక్. రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్ (రా) ఏజెంట్‌గా బాలయ్య కుమ్మేశాడట. పూరి గత సినిమాల్లో చూపించినట్లే ఓ అంతర్జాతీయ క్రిమినల్‌ను పట్టుకునే కాన్సెప్ట్‌తోనే ‘పైసా వసూల్’ కూడా తెరకెక్కించారు. కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్, కామెడీ, స్క్రీన్‌ప్లే‌తో పూరీ జగన్నాథ్ దీనికి కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. బాలయ్య మార్క్ డైలాగులు, యాక్షన్‌తో అభిమానులను కట్టిపడేశారు.

Plus Points:

  • బాలకృష్ణ పెర్ఫార్మన్స్
  • పూరి జగన్నాధ్ డైలాగ్స్
  • ఇంటర్వెల్ బాంగ్
  • స్క్రీన్ప్ ప్లే
  • ఆక్షన్ సీన్స్

Minus Points:

  • సాంగ్స్
  • సాగదీసిన సన్నివేశాలు
  • హీరోయిన్స్ పాటల వరకే పరిమితం అయ్యారు.

Final Verdict:

బాలయ్య ఫాన్స్ కి పెద్ద పండగ. పూరి మార్క్ సినిమా!

AP2TG Rating: 3 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top