పగలు అబ్బాయి…రాత్రయితే అమ్మాయి..! ఆ యువకుడు ఎందుకలా చేస్తున్నాడో తెలుస్తే కన్నీళ్లు వస్తాయి..!

అప్పుడెప్పుడో ఒక సినిమా చూసా..అందులో నానాపటేకర్,అర్జున్ మెయిన్ రోల్స్…నానా పటేకర్ క్యారెక్టర్ సినిమా దర్శకుడు,అర్జున్ ఏమో పోలీస్ ఆఫీసర్..హీరోయిన్ ఒక సీన్లో సరిగ్గా నటించకపోతే నిర్మొహమాటంగా తనని తీసేసి హీరోయిన్  కోసం వెతుకుతుంటే డ్యాన్స్ వేసుకునే అమ్మాయి తారసపడుతుంది నానాకి..అసలు విషయం ఏంటంటే తను అమ్మాయి కాదు అబ్బాయి..తననే హీరోయిన్ గా పెట్టి సినిమా తీసి ,తర్వాత అందరికి చెప్దామనుకుంటాడు నానా..కానీ ఈలోపులో తను అందమైన అమ్మాయనుకుని తనపై అఘాయిత్యం చేయాలనుకున్న వారిని చంపేస్తుంటుంది ఆ అమ్మాయి..అమ్మాయి వేషంలో ఉన్న అబ్బాయి..ఈ సినిమా  గురించి నేను ఇలా చెప్తే మీకు అర్దం కాదు కానీ మీరే చూడండి..ఆ సినిమా తమిళ్లో వచ్చిన బొమ్మలాట్టం..తెలుగు డబ్బింగ్ టైటిల్ పేరు రాణా.. మన స్టార్ హీరోయన్ కాజోల్ ఈ సినిమా ద్వారానే పరిచయం అయింది..భారతీరాజా దర్శకుడు..భారతీరాజా సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు..అమ్మాయి వేషం,అబ్బాయి వేషం వేసిన ఆ అమ్మాయి నటన మాత్రం భలే ఉంది….ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈ సినిమాలో లానే ఒకబ్బాయి అర్దరాత్రులు అమ్మాయి వేషం వేసుకుని డ్యాన్సు చేస్తూ అందరిని అలరిస్తున్నాడు..తన స్టోరీ వింటే అయ్యో అనకమానరు..

డిగ్రీ పూర్తి చేసిన లలిత్.. పోటీ పరీక్షల కోసం ఓ కోచింగ్ సెంటర్ లో చేరాడు. పగలంతా ఉద్యోగం కోసం కోచింగ్ సెంటర్ లో.. పొట్టకూటి కోసం రాత్రి వేళల్లో ఆడవేషంలో డ్యాన్స్ లు వేయడం.. లలిత్ కుమార్ బతుకుపోరాటం ఇది. బీహార్ లో అంతరించిపోతున్న సాంప్రదాయంలో లోండా కళ ఒకటి. ఇందులో మగవాళ్లే ఆడవేషం ధరించి నృత్యం చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో లలిత్ కూడా లోండా వృత్తిలోకి దిగాడు.లోండా అంతరించిపోతున్న కళ. దీనికి సంబంధించిన కళాకారులను లోండా అంటారు. లోండా కళాకారుడిగా విశేష గుర్తింపు కలిగిన లలిత్‌ కుమార్‌ అనేక కష్టాలు పడుతున్నాడు.ఈ లోండా కళలో పురుషులే స్త్రీ వేషం వేసి డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తుతారు.ఆ ప్రేక్షకులు కూడా పురుషులే..

అయితే రాను రాను ఈ కళ అంతరించిపోతుండటం.. తన ప్రతిభకు సరైన గుర్తింపు దక్కకపోవడటంతో లలిత్ ఆవేదన చెందుతున్నాడు. కళాకారుడిగా కొంతమంది తనను గౌరవిస్తుంటే.. ఆడవేషం కట్టినందుకు కొంతమంది తనను హేళన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నాడు. రోజురోజుకు ఈ అవమానాలు ఎక్కువవుతుండటంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. అయితే రాను రాను ఈ కళ అంతరించిపోతుండటం.. తన ప్రతిభకు సరైన గుర్తింపు దక్కకపోవడటంతో లలిత్ ఆవేదన చెందుతున్నాడు. కళాకారుడిగా కొంతమంది తనను గౌరవిస్తుంటే.. ఆడవేషం కట్టినందుకు కొంతమంది తనను హేళన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నాడు. రోజురోజుకు ఈ అవమానాలు ఎక్కువవుతుండటంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు.లోండా కళాకారులది ఒక వ్యధ…

Comments

comments

Share this post

scroll to top