రాష్ట్రపతి చేతుల మీదుగా 89 మందికి పద్మ పురస్కారాలు.. అందులో ఎనమిది మంది తెలుగు వారు అవ్వడం విశేషం !

పద్మ పురస్కారాలు, ఇవి భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం. వీటిని పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అని మూడు పురస్కారాలుగా వర్గీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2017 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు వాటిని ఢిల్లీలో రాష్ట్రపతి భవనంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ అవార్డు గ్రహీతలు పురస్కారాలను అందుకున్నారు.

డాక్టర్ సుబ్రోతో దాస్, జితేంద్రనాథ్ గోస్వామి, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ సాక్షి మాలిక్, పండిట్ విశ్వ మోహన్ భట్, సంజీవ్ కపూర్, డిస్కస్ త్రోవర్ వికాస్ గౌడ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, కేజే ఏసుదాసు పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నారు.ఇలా మొత్తం 89 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఏడుగురికి పద్మవిభూషణ్‌, మరో ఏడుగురు  పద్మభూషణ్‌ మరియు 75 మందికి పద్మశ్రీ అవార్డులు అందించారు. ఈ అవార్డు తీసుకున్న వారిలో 19 మంది మహిళలు ఉండగా 70 మంది పురుషులు ఉన్నారు.

పద్మ అవార్డులు తీసుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన ఎక్కా యాదగిరి, త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, డాక్టర్‌ మహ్మద్ అబ్దుల్ వహీద్‌, చంద్రకాంత్ పత్వా, దరిపల్లి రమేష్‌లను పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. కోటి మొక్కలు నాటిన ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేనేత ఆసుయంత్రం రూపొందించిన చింతకింది మల్లేశంకు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కలరియట్టు నిపుణురాలు కోటేశ్వరమ్మకు కూడా పద్మశ్రీ పురస్కారం అందించారు. ఇలా మొత్తం మన తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు ఎనమిది మంది ఉండడం విశేషం.

Comments

comments

Share this post

scroll to top