ఆ బాలిక త‌న తండ్రికి ఫోన్‌లో గుడ్ నైట్ చెప్పింది.. 10 నిమిషాల‌కే ఆ తండ్రి ఎలాంటి షాకింగ్ వార్త విన్నాడో తెలుసా.?

నేటి త‌రుణంలో జ‌రుగుతున్న అనేక మ‌ర‌ణాల్లో కొన్ని మిస్ట‌రీవి కూడా ఉంటున్నాయి. మొన్న‌టికి మొన్న జ‌రిగిన శ్రీ‌దేవి మృతి కేసు మిస్ట‌రీయే. గ‌తంలో ప‌లువురు న‌టులు కూడా ఇదే త‌ర‌హాలో అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయారు. కేవ‌లం సెల‌బ్రిటీలు మాత్ర‌మే కాదు, సామాన్యులలో కూడా కొంద‌రి మ‌ర‌ణాలు మిస్ట‌రీగానే ఉంటున్నాయి. అందునా.. నేటి ఆధునిక యుగంలో ఇలాంటి మిస్టరీ డెత్స్ పెరిగాయ‌నే చెప్ప‌వ‌చ్చు. స‌రే.. ఇదంతా ప‌క్క‌న పెడితే.. అస‌లు విష‌యం ఏమిటంటే… అప్పటి వ‌ర‌కు త‌న తండ్రితో చాలా హ్యాపీగా మాట్లాడిన బాలిక అంత‌లోనే భ‌వ‌నంపై నుంచి కింద ప‌డి మృతి చెందింది. మిస్ట‌రీ మృతిగా మారిన ఈ సంఘ‌ట‌న జ‌రిగింది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఇందిరాపురంలో శిప్ర కృష్ణ విస్టా అపార్ట్‌మెంట్‌లో 6వ అంత‌స్తులో రాహుల్ శ‌ర్మ అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు. అత‌ని కుమార్తె అగ్రిమ (14) స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌లో 8వ త‌ర‌గతి చ‌దువుతోంది. అయితే అగ్రిమ నిజానికి చ‌దువుల్లో చాలా బ్రిలియంట్‌. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. క్లాస్‌లో టాప్ మార్కులు తెచ్చుకుంటుంది. మంచి ర్యాంక్ కూడా వ‌స్తుంది. అంతేకాదు, ఈమె చెస్ కూడా బాగా ఆడుతుంది. అయితే ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన రాత్రి స‌మ‌యంలో అగ్రిమ ఇంటి నుంచి తండ్రికి కాల్ చేసింది. బాగా చ‌దువుతున్నా.. గుడ్ నైట్ అని చెప్పింది. త‌రువాత 10 నిమిషాల‌కు వారి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు రాహుల్‌కు ఫోన్ చేశాడు. మీ కూతురు బిల్డింగ్ పై నుంచి కింద‌కు ప‌డింది అని అత‌ను చెప్పాడు.

అలా కూతురి గురించిన వార్త‌ను విన‌గానే రాహుల్ ఒక్క‌సారిగా క‌దిలిపోయాడు. 10 నిమిషాల‌కు ముందే త‌న‌కు గుడ్ నైట్ చెప్పి ఇంత‌లోనే బిల్డింగ్ పై నుంచి ఎలా ప‌డి ఉంటుంది అని షాక్ అయ్యాడు. దాన్నుంచి తేరుకునే స‌మ‌యం కూడా అత‌నికి లేక‌పోయింది. హుటాహుటిన ఇంటికి వ‌చ్చి తీవ్ర గాయాల‌తో ప‌డి ఉన్న కూతుర్ని స్థానికంగా ఉన్న మ్యాక్స్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాడు. అయితే అప్పటికే తీవ్ర‌మైన గాయాలు కావ‌డంతో ఎక్కువ‌గా ర‌క్త స్రావం అయింది. దీంతో డాక్ట‌ర్లు అగ్రిమ‌కు 34 యూనిట్ల ర‌క్తం ఎక్కించారు. అయినా ఆమె లివ‌ర్‌, కిడ్నీలు ప‌నిచేయ‌లేదు. దీంతో అగ్రిమ మృతి చెందింది. అయితే అగ్రిమ ప్ర‌మాద‌వ‌శాత్తూ బిల్డింగ్ పై నుంచి కింద‌కు ప‌డ‌లేద‌ని, ఎవ‌రో కావాల‌నే తోసి ఉంటార‌ని, త‌న కూతురు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత ప‌ని చేయ‌ద‌ని, ఆమె చ‌దువుల్లో బ్రిలియంట్ అని తండ్రి చెబుతున్నాడు. ఏది ఏమైనా.. ఇలాంటి మిస్ట‌రీ కేసుల్లో మాత్రం నిందితుల‌ను అంత ఈజీగా ప‌ట్టుకోలేరు క‌దా..! న‌టి శ్రీ‌దేవి మృతి సంఘ‌ట‌న‌లా..!

Comments

comments

Share this post

scroll to top