నీచమైన ఘటన: సైకిల్ పై వెళుతున్న 10 ఏళ్ల బాలికను వెంబడించి అత్యాచార యత్నం..సీసీ ఫుటేజ్ చుస్తే కోపమొస్తది!

మ‌హిళ‌లు, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం ఎన్నో చ‌ట్టాలు చేశామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నప్ప‌టికీ ఇంకా వారిపై వేధింపులు, దాడులు ఆగ‌డం లేదు. ముఖ్యంగా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనే ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ఈ త‌ర‌హా ఘ‌ట‌నలు ఇంకా పెరిగాయ‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం అనేక చ‌ట్టాలు ఉన్నాయ‌ని చెబుతున్నా వారిపై జ‌రిగే దాడులు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ 10 ఏళ్ల బాలిక‌ను వేధించాడు ఓ యువ‌కుడు.

మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని శివ్‌పురి అనే ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వ‌ద్ద ప‌ట్ట ప‌గ‌టి పూట‌ ఓ బాలిక (10) సైకిల్ పై వ‌చ్చింది. అయితే అప్ప‌టికే ఆమెను అనుస‌రించిన ఓ యువ‌కుడు ఆ బాలిక సైకిల్‌పై దిగే వ‌ర‌కు వేచి ఉండి వెంట‌నే ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చి వేధించాడు. దీంతో ఆ యువ‌కుడి నుంచి ఆ బాలిక త‌ప్పించుకునేందుకు వెన‌క్కి వెళ్లింది. అత‌ను కూడా వెన‌క్కి వెళ్లి ఆ బాలికను ప‌ట్టుకున్నాడు. అనంత‌రం వేధించాడు. దీంతో ఆ బాలిక ఎలాగో త‌ప్పించుకుని లోప‌లికి వెళ్లింది. వెంట‌నే ఆ యువ‌కుడు అక్క‌డి నుంచి పారిపోయాడు.

అయితే ఆ యువ‌కుడు ఆ బాలిక‌ను వేధించే స‌మ‌యంలో అపార్ట్‌మెంట్‌కు అమ‌ర్చ‌బ‌డి ఉన్న సీసీటీవీల్లో ఆ దృశ్యాలు రికార్డ‌య్యాయి. వాటిని సేక‌రించిన ఆ బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు. అయితే అత‌నికి స‌హ‌క‌రించిన మ‌రో యువ‌కున్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా వేధింపులు, దాడుల విష‌యానికి వ‌స్తే నిజంగా దేశంలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం అన్నింటిక‌న్నా ముందుందని సాక్షాత్తూ నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. ఈ సంస్థ చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం నిత్యం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చిన్నారులు, మ‌హిళ‌లు క‌లిసి మొత్తం వారు పెడుతున్న వేధింపుల కేసులు 35 వ‌రకు న‌మోద‌వుతున్నాయ‌ట‌. దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు అక్క‌డ వారికి ఏ విధ‌మైన ర‌క్ష‌ణ ఉందో. ఏది ఏమైనా ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కాదు, కేంద్రం కూడా ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది..!

watch video here:

Comments

comments

Share this post

scroll to top