తమలపాకు తొడిమతో తింటే ఏం జరుగుతుందో తెలుసా…..తమలపాకు ప్రయోజనాలేంటో తెలుసుకోండి…

ప్రతి చిన్న సమస్యకు హాస్పటల్ కు పరిగెడతాం కానీ.. ఎన్నో సమస్యలకు మన ఇంట్లోనే చక్కటి ఔషదాలుంటాయి..కాకపోతే కాస్త ఓపిక చేసుకుని అవేంటో తెలుసుకుని పాటిస్తే చాలు ..దగ్గు ,జలుబు, చెవినొప్పి ఇలా ఎన్నో సమస్యలకు తమలపాకు మంచి ఔషదం గా పనిచేస్తుంది.తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

  • తమలపాకులో సున్నం, పొగాకు కలిపి తీసుకోకూడదు. రోజూ 2నెలల పాటు ఒక తమలపాకు 10 గ్రాముల మిరియం గింజలు కలిపి తీసుకుని వెంటనే చన్నీళ్లు తాగితే స్థూలకాయులు నాజూగ్గా తయారవుతారు
  • తమలపాకును తొడిమితో తింటే మహిళల్లో వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. కానీ సంతానం కోరుకునే వారు తమలపాకును తొడిమిని తొలగించి వాడుకోవాలి. తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే మహిళల్లో కలిగే క్షణికావేశం తగ్గుతుంది.
  • తమలపాకు ముద్దను తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
  • తమలపాకు రసాన్ని ముక్కుల్లో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.తమలపాకు రసం శ్వాసకోశ వ్యాధులకు, గొంతునొప్పి నివారణకు ఉపయోగించుకోవచ్చు. తమలపాకు ఆకులకు నూనె రాసి కాస్త వేడి చేసి ఛాతిపై ఉంచితే శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి.
  • దెబ్బతగిలిన చోట తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడితే.. గాయాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవినొప్పి తగ్గిపోతుంది.
  • ఎముకలకు మేలు చేసే క్యాల్షియం ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి.తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ తమలపాకులో ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే సున్నం, వక్క తదితర కృత్రిమ పదార్థాలు కలిపి తమలపాకును తీసుకుంటే శరీరానికి హాని చేస్తాయి.
  • ఆవనూనె, నువ్వులనూనె ఇతరత్రా నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకును వేసి నిల్వ చేయండి. తమలపాకును తొడిమితో తింటే మహిళల్లో వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. కానీ సంతానం కోరుకునే వారు తమలపాకును తొడిమిని తొలగించి వాడుకోవాలి. అయితే తమలపాకును ఔషధంగా మాత్రమే పరిమితంగా వాడుకోవాలి.
  • అధిక రక్తపోటు గలవారు తమలపాకును దూరంగా పెట్టాలి. తమలపాకును అదే పనిగా తీసుకోకూడదు.

Comments

comments

Share this post

scroll to top