ఆ వ్య‌క్తి త‌న సాధార‌ణ కారును బెంజ్ కారుగా మార్చాడు. త‌రువాత ఏమైందో తెలుసా..?

విలాస‌వంత‌మైన కార్ల‌ను న‌డపాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ ఆ క‌ల‌ను కొంద‌రు మాత్ర‌మే సాకారం చేసుకుంటారు. ఎందుకంటే వారు ధ‌నికులు కాబట్టి. ధ‌నికులు అయితేనే ల‌గ్జ‌రీ కార్ల‌ను కొన‌గ‌ల‌రు. క‌నుక వారే ఆ కార్ల‌లో తిరిగే అదృష్టాన్ని పొందుతారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంటుంది.. కానీ లగ్జ‌రీ కార్ల‌లో తిర‌గాల‌నే మోజు ఉండి అది అత్యాశ‌కు దారి తీస్తే మాత్రం ప‌రిస్థితి ఇదిగో.. సరిగ్గా ఈ వ్యక్తికి జ‌రిగిన‌ట్టే ఉంటుంది. ఎందుకంటే ఇత‌ను.. త‌న సాధార‌ణ కారును ల‌గ్జ‌రీ కారుగా మార్చాల‌నుకున్నాడు. చివ‌ర‌కు డ‌బ్బు వెచ్చించి కారును అలా మార్చేశాడు కూడా. కానీ ఆర్‌టీఏ వారి క‌ళ్ల‌లో ప‌డ్డాడు. ఇంకేముందీ.. చివ‌ర‌కు కారును పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది.

అది ఉత్త‌ర కేర‌ళ ప్రాంతం. అక్క‌డ నివాసం ఉండే ఓ వ్య‌క్తి త‌న మారుతి బ‌లెనో కారును మెర్సిడెస్ బెంజ్‌ ఎ-క్లాస్ కారుగా మార్చాల‌నుకున్నాడు. ఇంకేముందీ రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాడు. ముందు భాగంలో ఉండే మారుతి లోగో తీసేసి మెర్సిడెస్ లోగో పెట్టాడు. దాంతోపాటు అలాయ్ వీల్స్‌, హెడ్‌, టెయిల్ ల్యాంప్స్‌, ముందు, వెనుక బంప‌ర్‌.. వంటి భాగాల‌ను తీసి బెంజ్ కారుకు ఉండే భాగాల‌ను దానికి ఫిక్స్ చేశాడు. దీంతో మారుతీ బలెనో కారు కాస్తా మెర్సిడెస్ బెంజ్‌ ఎ-క్లాస్ కారుగా మారింది. చూసేందుకు అచ్చం అది బెంజ్ కారు లాగే త‌యారైంది. దీంతో ఆ వ్య‌క్తి త‌న తెలివికి తానే మురిసిపోయాడు.

అయితే అత‌నికి కారు ల‌గ్జ‌రీగా మారంద‌న్న సంతోషం కొంత సేపు కూడా నిల‌వ‌లేదు. ఎవ‌రో ఆ కారు విష‌యాన్ని ఆర్‌టీఏకు తెలియ‌జేశారు. దీంతో వారు ట్రేస్ చేసి ఆ కారును ప‌ట్టుకున్నారు. అనంత‌రం దాని విడిభాగాల‌ను తీసేసి అంత‌కు ముందు ఎలా ఉండేదో ఆ రూపానికి తెచ్చారు. ఇక కారును డీ రిజిస్ట‌ర్ చేయ‌నున్నారు. అంటే దాని రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దు చేయ‌నున్నారు. దీంతో ఆ కారును ఆ వ్య‌క్తి కోల్పోవాల్సి వ‌చ్చింది. అయితే ఇత‌నే కాదు, ఎవ‌రైనా తమ వాహ‌నాన్ని ఇలా మార్చ‌డం చ‌ట్ట‌ప‌రంగా నేర‌మ‌ని ఆర్‌టీఏ వారు చెప్పారు. చూశారుగా.. కారును అలా మోడిఫై చేస్తే ఆ వ్య‌క్తికి ఎంత న‌ష్టం జ‌రిగిందో..! క‌నుక ఎవ‌రూ కూడా అలా వాహ‌నాల‌ను మోడిఫై చేయ‌కండి. లేదంటే వాహ‌నాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది..!

Comments

comments

Share this post

scroll to top