SHOCKING: తమిళ్ బిగ్ బాస్ లో సంచలనం..! ఒకరి సూసైడ్ అటెంప్ట్, మరొకరి మృతి..! కారణం తెలుసా..?

ఏ ముహూర్తాన మొదలైందోగానీ, తమిళ బిగ్‌బాస్‌కు ఆది నుంచీ ఆటంకాలే. షోపై ఏదో ఒక ఫిర్యాదు, ఏదో ఒక కేసు నమోదు అవుతోంది. ఒకటి పోయింది అనుకునే సరికి మరొకటి తగులుకుంటోంది. తాజాగా ఇప్పుడు అంతకుమించి ఓ కలకలం రేగింది. తమిళ బిగ్ బాస్ హౌస్‌లో ఓ పార్టిసిపెంట్ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఇప్పుడు అక్కడ పెను దుమారాన్నే రేపుతోంది. తన ప్రేమను తిరస్కరంచిన తోటి కంటెస్టెంట్ ఆరవ్, దూరంగా ఉంటున్నాడన్న ఆవేదనతో కంటెస్టెంట్ ఓవియా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ముక్కుమూసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ వ్యవహారమంతా బయటకు పొక్కడంతో బిగ్ బాస్ హౌస్‌కు పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. అసలు ఆ షోలో, హౌస్‌లో ఏం జరుగుతోందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం. అక్కడి ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ హౌస్‌లో అరాచక వాతావరణం కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.

కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కోలీవుడ్ బిగ్ బాస్ సంచలనాలకు వేదికగా మారుతుంది. ఇప్పటికే వివాదాలు కేసులతో హాట్ టాపిక్ గా మారిన ఈ షో.. కంటెస్టెంట్ ఓవియా ఆత్మహత్యాయత్నం వార్తలతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ షోకు సంబంధించిన మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. త‌మిళ బిగ్ బాస్ సెట్ లో ప్లంబింగ్ పని చేసే వ్యక్తి అనుమానాస్పద మృతి చ‌ర్చనీయాంశంగా మారింది.

watch video here:


ముంబయికి చెందిన 28 ఏళ్ల ఇబ్రహీం షేక్ తమిళ బిగ్ బాస్ సెట్ లో ప్లంబర్ గా పని చేస్తున్నాడు. చెన్నై స‌మీపంలో వేసిన సెట్ లో పనిచేస్తుండగా అతను అనుకోకుండా కింద ప‌డిపోయాడ‌ట‌. వెంటనే స్పందించిన సిబ్బంది అతన్ని కిల్ పాల్ మెడిక‌ల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టుగా డాక్టర్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంతో బిగ్ బాస్ నిర్వాహ‌కులకు ఇది షాకింగ్ గా మారింది.

Comments

comments

Share this post

scroll to top