మన తెలుగు సినిమా హీరోయిన్స్ ఈ పాత్రలకే పనికొస్తారా… ఆడవాళ్లకి సినిమా వాళ్లు ఇస్తున్న విలువ ఇదీ.!!

కర్తవ్యం ,లేడీబాస్,ఒసేయ్ రాములమ్మ సినిమాల్లో విజయశాంతి నటన అద్భుతం.. లేడీ అమితాబ్ బచ్చన్ గా విజయశాంతికి పేరు..విజయ శాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది ఛార్మీ..హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే సినిమాలు ఆడవంటారు..అలా అని హీరోయిన్ లేకుండా సినిమా తీసి హిట్టు కొట్టి చూపండి అంటే అలా కూడా చేయరు..సినిమా ఇండస్ట్రీలో ఒన్ పర్సంట్ తప్ప మిగతా 99% వారికి కూడా హీరోయిన్ ఎందుకు అవసరమో తెలుసా..హీరోయిన్స్ కి  వారిచ్చే ప్రాధాన్యత..వారికిచ్చే పాత్రలు చూస్తే… ఆకాశంలోకి దూసుకెళ్తున్న మహిళ సినిమా వాళ్ల దృష్టిలో మాత్రం ఇంకా అంగడి సరుకుగా ఉందనిపించకమానదు… మన తెలుగు సినిమా హీరోయిన్స్ ఎక్కువగా చేసే పాత్రలేంటో చూడండి..

  • అస్సలు తెలుగు సినిమాల్లో ఏ ఒక్క హీరోయిన్ కూడా ఉద్యోగం చేయదు.పని పాట లేక హీరోవెనుకాల తిరుగుతుంటుంది.హీరో మాత్రం చాలా స్ట్రాంగండోయ్..హీరోయినే చాలా వీక్..ఈ విషయంలో పూరీ ఒక మెట్టు పైనున్నాడని చెప్పొచ్చు ఇప్పటివరకు తను తీసిన తన సినిమాల్లో హీరోయిన్స్ ని వారు ఏదో ఒక పని చేస్తున్నట్టుగా చూపించాడు.మన తెలుగు సినిమాల్లో మాత్రం వారికి అసలు కెరీర్ అనేది ఒకటి ఉండి ఏడ్చినట్టు కూడా చూపించరు..
  • ఇకపోతే ప్రతి హీరోయిన్ కూడా ఏదో ఒక సమస్యతో హీరో ముందుంటుంది.అది పరిష్కరించే పనిలో హీరో ఉంటాడు..అలా వెళ్తున్న క్రమంలో హీరోయిన్ హీరోతో ప్రేమలో పడ్తుంది..అంతే..కానీ రియల్ లైఫ్ లో అమ్మాయిల సమస్యలకు ఏ హీరో కూడా అడ్డుపడడు.తన సమస్యలను తానే పరిష్కరించుకుంటుంది.ఈ కోణంలో ఎందుకు సినిమా తీయరో..తీసినా చాలా తక్కువ ఎక్కడో మచ్చుక్కి ఒకటి ప్రతిఘటన లాంటివి.
  • సినిమాల్లో ఆరు పాటలుంటే వాటికి హీరోయిన్ కావాలి.అందులో కూడా హీరో తన ఆటపాటలతో అలరిస్తుంటే హీరోయిన్ తన అందాల ఆరబొతతో మాత్రమే కనపడాలి.అంతకు మించి ఒకటి అరా సీన్లు అంతే..అవి కూడా అందాల ఆరబొతకే పెద్దపీట వేస్తాయి.
  • హీరోయిన్ ఏదో ఉద్యోగం చేస్తుందని చూపించారనుకుందాం..అది ఖచ్చితంగా టీచర్ పాత్ర లేదంటే డాక్టర్ ఇంజినీర్, అదీ కాకపోతే ఏ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ క్యారెక్టర్. ఇవి తప్ప పోలీస్,లాయర్ ,సైంటిస్ట్ ఇలాంటి పాత్రలకు హీరోయిన్స్ సెట్ కారా నాకు అర్దం కాక అడుగుతాను..మరీ అమ్మాయిలు అంత సెన్సిటివా..
  • సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ లో హీరో కనపడతాడు కానీ తిప్పి కొడితే హీరోయిన్ కనపడేది ఒకటి అరా ఫ్రేమ్ లు..కానీ పోస్టర్స్,ప్రమోషన్లో  మాత్రం హీరోయిన్ ప్రతి పోస్టర్లో కనపడుతుంది.ఆకరుకి ట్రైలర్ కూడా కేవలం హీరో చుట్టురానే తీస్తారు..ట్రైలర్లో హీరోయిన్ ని చూపించినా సాంగ్స్ లేదంటే రొమాంటిక్ సీన్స్ అంతే.

 

 

Comments

comments

Share this post

scroll to top