ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన PG-ఎంట్రన్స్ పరీక్షపై తీవ్ర దుమారం రేగుతుంది. ఓయూ నిర్వహించిన PG ఎంట్రన్స్ టెస్ట్ లో …ఫిలాసఫి సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నా పత్రంలో 100 కు 100 ప్రశ్నలు గతంలో వచ్చినవ ప్రశ్నలు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .! 2015 లో ఏ ప్రశ్నలైతే వచ్చాయో…సేమ్ టు సేమ్ 2016 లో కూడా అవే ప్రశ్నలు రిపీట్ అయ్యాయట… కేవలం నెంబర్ ఆర్డర్ అయితే మారింది కానీ..100 కు 100 ప్రశ్నలు పాతవే వచ్చాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు..
అయినా..ప్రీవియస్ పేపర్ నుండి ఓ 5 లేదా 10 ప్రశ్నలు రిపీట్ అయితే ఏమో అనుకోవొచ్చు..100 కు 100 ప్రశ్నలు ప్రీవియస్ పేపర్ నుండే దించారంటే… పేపర్ ను సెట్ చేసిన అధ్యాపకుల నిర్లక్ష్యం ఏమేరకుందో అర్థం చేసుకోవొచ్చు. ఏదో 20,30 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రశ్నలంటే ఓ అర్థముంది..అలా కాకుండా గతయేడాది పేపర్ లోని ప్రశ్నలనే మళ్లీ ఇస్తే దానిని ఏమనుకోవాలి?
ఇప్పటికే చదువు విషయంలో ఓ యూ బ్రాండ్ నేమ్ రోజురోజుకి దిగజారుతున్న ఈ సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం…మన అధికారుల బాధ్యతారాహిత్యం.