అమెరికా అంతు చూస్తానంటున్న అల్‌ఖైదా లీడ‌ర్‌… అత‌ను ఎవ‌రో తెలుసా..?

అమెరికాపై ఉగ్ర‌వాద సంస్థ అల్‌ఖైదా జ‌రిపిన దాడులు గుర్తున్నాయి క‌దా. 2001 సెప్టెంబ‌ర్ 11న అమెరికాలో ఉన్న వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌, పెంట‌గాన్ ట్విన్ ట‌వ‌ర్ల‌ను విమానాలు ఢీకొన్నాయి. 19 మంది ఉగ్ర‌వాదులు ఆ విమానాల‌ను హైజాక్ చేసి వాటిని అలా ఢీకొట్టించారు. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. ఈ దాడిలో సుమారుగా 3వేల మంది చ‌నిపోగా, 6వేల మందికి పైగా గాయ‌లయ్యాయి. దీంతో అమెరికా ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. అయితే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన అల్ ఖైదా నాయ‌కుడు ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకుని కాల్చి చంపింది. 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో లాడెన్‌ను అంత‌మొందించింది అమెరికా సైన్యం. అయితే క‌థ అక్క‌డితో ముగియ‌లేదు. ఎందుకంటే…

ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా ఇంకా బ‌తికే ఉన్నాడు. క‌నుక అల్‌ఖైదా క‌థ ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు. అమెరికా, కాచుకో. మేము వ‌స్తున్నాం. నా తండ్రిని చంపినందుకు క‌చ్చితంగా విరుచుకుప‌డ‌తా. ఇరాక్, ఆఫ్ఘ‌నిస్తాన్‌పై దాడికి బ‌దులు తీర్చుకుంటా. అని చెబుతున్న హ‌మ్జా వీడియో ఒక‌టి ఇటీవ‌లే బ‌య‌ట ప‌డింద‌ట‌. దీంతో మ‌రోసారి అల్‌ఖైదా ప‌ట్ల అప్ర‌మ‌త్త‌మ‌వుతోంది అమెరికా స‌ర్కార్‌. అయితే నిజానికి లాడెన్‌ను మ‌ట్టుబెట్టిన‌ప్పుడే హమ్జాకు 22 ఏళ్ల‌ట‌. అది ఎలా తెలిసిందంటే…

పాకిస్థాన్‌లో లాడెన్ చ‌నిపోయిన అబోటాబాద్‌లో ఉన్న ఇంట్లో హమ్జా లాడెన్‌కు రాసిన కొన్ని లెట‌ర్లు దొరికాయ‌ట‌. ఈ క్ర‌మంలో లాడెన్ త‌రువాత అల్‌ఖైదా కొత్త లీడ‌ర్ హ‌మ్జాయే అని తెలిసింది. అంతేకాదు, ప‌విత్ర యుద్ధం జీహాద్ కోస‌మే తాను బ‌తికున్నాన‌ని, త‌న తండ్రి లాడెన్ చెప్పిన ప్ర‌తి మాట త‌న చెవిలో మోగుతూనే ఉంటుంద‌ని, త‌ను నేర్పిన బాట‌లోనే ప‌య‌నిస్తాన‌ని హ‌మ్జా ఆ లేఖ‌లో రాశాడ‌ట‌. సౌఫ‌న్ అనే మాజీ ఎఫ్‌బీఐ అధికారి ఈ వివ‌రాల‌ను వెల్లడించాడు. కాగా హ‌మ్జా ఆల్‌ఖైయిదాలో కొత్త ర‌క్తం నింపేందుకు సిద్ధ‌మైన‌ట్లు సౌఫన్ తెలిపారు.

అయితే దీని గురించి అప్ప‌ట్లో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు. కానీ తాజాగా బ‌య‌ట ప‌డ్డ హ‌మ్జా వీడియో హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడీ విషయం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో అమెరికాయే కాదు, ఉగ్ర‌వాదం వ‌ల్ల న‌ష్ట‌పోతున్న దేశాల‌న్నీ ఇప్పుడు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. అయితే ఇప్పుడు లాడెన్ కొడుకు హ‌మ్జా ఎక్క‌డ ఉన్నాడ‌నే దానిపై స్ప‌ష్ట‌త లేదు. కానీ పాకిస్థానే అత‌నికి ఆశ్ర‌యం ఇస్తున్న‌ట్టు తెలిసింది. మ‌రి ఈ విష‌యంపై పాక్ ఏమంటుందో..? ఆ ఉగ్ర‌వాది హ‌మ్జా ఎలా దాడి చేస్తాడో..? కాల‌మే చెబుతుంది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌ల్లో ఉండ‌డం మంచిది..!

Comments

comments

Share this post

scroll to top