ఇంటెర్నెట్ ను ఊపేస్తున్న పిల్ల తెలుగులోకి..? ఏ సినిమాతో అనుకుంటున్నారా.?

ప్రియా ప్రకాష్ మూడు రోజులుగా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న అమ్మాయి..ఎవర్ని కదిపినా ఆ అమ్మాయి చర్చే,ఎవరి ఫ్రొఫైల్ చూసినా ఆ అమ్మాయి ఫోటోలే..అంతలా అందరిని ఆకట్టుకుంది.కేవలం కన్నుకొట్టి కుర్రాళ్లందరిని పడేసింది.ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తే కేవలం కుర్రాళ్లే కాదు అందరూ ఫిదా అవ్వాల్సిందే..ఒరు అడార్ లవ్ అనే సినిమాలో పాటను,టీజర్ ను వాలెంటైన్స్ డే సంధర్భంగా రిలీజ్ చేశారు.ప్రియా ప్రకాష్ ఎక్స్ప్రెషన్ కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు..ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.సన్నీ లియోన్ ని దాటేసి మరీ ఇన్స్ట్రాగ్రాం ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది..ఇప్పుడు దీన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు ఒరు అడార్ లవ్ సినిమా నిర్మాత..ఎలా అంటారా..

30 సెకన్ల వీడియోతో సూపర్ పాపులారిటీ సంపాదించింది ప్రియ.. ఇప్పుడు ‘ఒరు అడార్ లవ్’ టీజర్ తో మరింతగా మురిపిస్తోంది. ఈ టీజర్ లో ఆమె తుపాకీ ముద్దు కూడా అప్పుడే సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది.ఇంటర్నెట్లో ఈ టీజర్ కు వస్తున్న క్రేజ్ చూశాక ఈ చిత్రాన్ని మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు సమాచారం. తమిళం.. తెలుగు.. హిందీ భాషల్లో సైతం సినిమాను రిలీజ్ చేస్తారట. ప్రియ ప్రకాష్ వారియర్ కోసమైనా జనాలు సినిమా చూస్తారని.. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని నిర్మాత డిసైడయ్యాడట. టీనేజ్ లవ్ స్టోరీ కాబట్టి అందరికీ కనెక్టవుతుందని భావిస్తున్నారు. మిగతా భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారట. ఈ చిత్రంలో ప్రియకు జోడీగా రోషన్ అబ్దుల్ నటించాడు. ఆ అబ్బాయి హావభావాలు కూడా టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి. ఒమర్ లు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Comments

comments

Share this post

scroll to top