అప్పులు తీర్చడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్న ఆ గ్రామస్థులు.!?

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా ఏం చేస్తాడు? ఏదో ఒక విధంగా వాటి నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలోనే తనకు ఉన్న అన్ని దారులను అన్వేషించి ఆ క్రమంలో ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేస్తాడు. అయితే డబ్బు వచ్చేందుకు ఏ దారీ దొరక్కపోతే? ఆ స్థితిలో సామాన్య, పేద తరగతికి చెందిన వారుంటే? ఏవిధంగా తమ అప్పులు తీరుస్తారు? సరిగ్గా ఇదే బలహీనతలో ఉన్న ఓ గ్రామానికి చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకున్నాయి అవయవాలను అమ్ముకునే ముఠాలు. బాధితుల నుంచి యథేచ్ఛగా అవయవాలను సేకరించి విక్రయిస్తూ తమ దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి.
Kidney-750x500
గుజరాత్‌లోని పండోలి గ్రామంలో ఇప్పుడు అవయవ విక్రయం సర్వసాధారణమైపోయింది. ప్రధానంగా ఈ గ్రామంలో నివసించే అధిక శాతం మంది పురుషులు తమ కిడ్నీలను అమ్ముకుంటున్నారు. అమీర్ మాలిక్ అనే ఓ 27 ఏళ్ల వ్యక్తికి రూ.1 లక్ష వరకు అప్పు ఉంది. అతను ఆ బాకీ తీర్చలేకపోతున్నందుకు గాను తన స్నేహితులను సహాయం చేయమని అడిగాడు. దీంతో వారు కిడ్నీ అమ్ముకోమని సలహా ఇవ్వగా అమీర్ ఆ ప్రకారం చేశాడు. దీంతో అతనికి రూ.2.30 లక్షలు వచ్చాయి. దాంట్లో తన అప్పుకు కొంత పోగా, మిగిలిన మొత్తాన్ని తన ఇద్దరు కూతుళ్ల వివాహం కోసం బ్యాంకులో వేసుకున్నాడు.
&NCS_modified=20141103121713&MaxW=640&imageVersion=default&AR-141109912
అయితే అమీర్ ఒక్కడే కాదు. పండోలి గ్రామంలో ఎక్కువగా ఈ తరహా అవయవ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఏకంగా 13 మంది పురుషులు తమ కిడ్నీలను అమ్ముకున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారుల ప్రత్యేక దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. కాగా కిడ్నీలను అమ్ముకున్న ఆ 13 మందిని అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పరిశీలన నిమిత్తం పంపారు. అయితే బాధితులకు మాత్రం ఇదంతా ఏమీ తెలియదు.
1994 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం అవయవాలను నేరుగా విక్రయించడం నేరం. దానం ఇచ్చేవారు, తీసుకునే వారు పరస్పర అంగీకారంతో ముందుగా ఆర్గాన్ డొనేషన్ కమిటీలో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ కమిటీ నుంచి అనుమతి వచ్చాకే అవయవాలను దానం చేయాల్సి ఉంటుంది. ఇది తెలియని బాధితులు హాస్పిటల్స్ నియమించిన ఏజెంట్ల చేతికి దొరికి అన్యాయమైపోతున్నారు. ఈ క్రమంలో బాధితులను కిడ్నీల అమ్మకం గురించి అధికారులు ప్రశ్నించినా వారు తమ ఇష్టం మేరకే కిడ్నీలను అమ్ముకున్నామని అధికారులకు చెప్పారు. ఇదంతా తమ గ్రామంలో సర్వసాధారణమని కూడా అధికారులకు సెలవిచ్చారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. ప్రస్తుతం ఈ కిడ్నీ రాకెట్‌కు సంబంధించిన కేసు కోర్టులో కొనసాగుతోంది. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి ఏజెంట్లు తారసపడితే వారి వలలో పడి మాత్రం మోసపోవద్దు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top