ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్‌ సీజన్లలో ఆరెంజ్‌ క్యాప్‌లు ఏయే ప్లేయర్లకు వచ్చాయో తెలుసా..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018 సీజన్‌ దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. మొదటి రెండు స్థానాల్లో ఆ జట్లు ఉన్నాయి. దీంతో చివరి రెండు స్థానాల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఈ సీజన్‌ విజేత ఎవరు అన్నది కూడా తేలిపోనుంది. కానీ.. విజేత సంగతి పక్కన పెడితే ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 సంవత్సరం నుంచి గతేడాది వరకు కూడా ఏ సీజన్‌లో అయినా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్‌ క్యాప్‌, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ కు పర్పుల్‌ క్యాప్‌ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇక ఈ సీజన్‌లోనూ ఈ రెండు అవార్డుల కోసం అనేక మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. మరి గత సీజన్లలో ఆరెంజ్‌ క్యాప్‌ లు సాధించిన ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

2008…
ఈ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌కు ఆడిన షాన్‌ మార్ష్‌ 11 మ్యాచ్‌లలో 616 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. ఈ సీజన్‌లో ఇతని యావరేజ్‌ 68.44 కాగా ఇతను ఈ సీజన్‌లో 1 సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

2009…
ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ 52 సగటుతో 572 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. ఇతని ఇన్నింగ్స్‌లలో మొత్తం 5 అర్థ సెంచరీలు ఉన్నాయి.

2010…
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ సచిన్‌ టెండుల్కర్‌ 15 మ్యాచ్‌లలో 47.53 సగటుతో, 5 అర్థ సెంచరీలు కలిపి మొత్తం 618 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు.

2011…
ఈ సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ను క్రిస్‌ గేల్‌ దక్కించుకున్నాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుకు ఆడిన అతను మొత్తం 12 మ్యాచ్‌లలో 67.55 సగటుతో, 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు చేసి మొత్తం 608 పరుగులు చేశాడు.

2012…
ఈ సీజన్‌లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుకు ఆడిన క్రిస్‌ గేల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. మొత్తం 15 మ్యాచ్‌ లలో 61.08 సగటుతో, 1 సెంచరీ, 7 అర్థ సెంచరీలు కలిపి మొత్తం 733 పరుగులు చేశాడు.

2013…
ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు ఆడిన మైకేల్‌ హస్సీ ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన హస్సీ 52.35 సగటుతో, 6 అర్థ సెంచరీలతో మొత్తం 733 పరుగులు చేశాడు.

2014…
ఈ సీజన్‌లో మొత్తం 660 పరుగులు చేసిన కోల్‌కతా ఆటగాడు రాబిన్‌ ఊతప్ప ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన ఊతప్ప 44 యావరేజ్‌తో 5 అర్థ సెంచరీలు కలిపి 660 పరుగులు చేశాడు.

2015…
ఈ సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 43.23 సగటుతో 7 అర్థ సెంచరీలు కలిపి మొత్తం 562 పరుగులు చేశాడు.

2016…
ఈ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు ఆటగాడు విరాట్‌ కోహ్లి ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 81.08 సగటుతో 4 సెంచరీలు, 7 అర్థ సెంచరీలు కలిపి మొత్తం 973 పరుగులు చేశాడు.

2017…
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఆరెంజ్‌ క్యాప్‌ సాధించాడు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 58.27 సగటుతో 1 సెంచరీ, 4 అర్థ సెంచరీలతో మొత్తం 641 పరుగులు చేశాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top