మీ ఇండియ‌న్స్ బిచ్చ‌గాళ్లు,వెధ‌వ‌లు అంటూ కామెంట్స్ చేసిన‌ OPPO మొబైల్ కంపెనీ అధికారి.!

”మీ భార‌తీయులు ఉత్త వెధ‌వ‌లు. డ‌బ్బు కోస‌మే ప‌నిచేస్తారు. థూ… ఇండియ‌న్స్‌..! మీక‌స‌లు మ‌ర్యాద‌, ఆత్మ‌గౌర‌వం అంటే ఏమిటో తెలియ‌వు. మీ ఇండియ‌న్స్ బిచ్చ‌గాళ్లు…” ఈ మాట‌ల‌న్న‌ది ఎవ‌రో తెలుసా..? ఒప్పో అనే పేరున్న చైనా కంపెనీ ఒక ఏడ్చి చచ్చింది క‌దా. అది స్మార్ట్‌ఫోన్ల‌ను త‌యారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన చైనా అధికారి ఒక‌డు ఈ కూత‌లు కూశాడు. దీంతో అత‌ని కింద ప‌నిచేస్తున్న భార‌తీయ ఉద్యోగులు స‌ద‌రు అధికారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. వారు మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేశారు..!

 

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఫోన్ల‌ను అమ్మే డిస్ట్రిబ్యూట‌ర్ ఆఫీస్‌లే కాదు, ఫోన్లు చెడిపోతే బాగు చేసి ఇచ్చే స‌ర్వీస్ సెంట‌ర్లు కూడా ఉన్నాయి. అయితే పంజాబ్‌కు చెందిన ఒప్పో ప్ర‌ధాన స‌ర్వీస్ సెంట‌ర్‌లో ఆ కంపెనీకి చెందిన చైనా అధికారి ఒక‌డు ఈ మ‌ధ్య కాలంలో ఆ సెంట‌ర్‌లో ప‌నిచేస్తున్న భార‌తీయ ఉద్యోగుల‌ను రాచి రంపాన పెడుతున్నాడ‌ట‌. నైట్ బాగా లేట్ అయ్యేంత వ‌ర‌కు ప‌నిచేయించుకోవ‌డ‌మే కాదు, జీతం పెంచ‌మ‌ని అడిగితే పైన చెప్పిన విధంగా తిట్టే వాడ‌ట‌. దానికి తోడు ప‌నిష్‌మెంట్లు కూడా వేసే వాడ‌ట‌.

అయితే ఇక దీన్ని ఎంత మాత్రం భ‌రించ‌లేని స‌ద‌రు ఒప్పో స‌ర్వీస్ సెంట‌ర్ భార‌తీయ ఉద్యోగులు తాజాగా ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. వారు త‌మ ఉద్యోగాల‌కు మూకుమ్మ‌డిగా రాజీనామా చేశారు. అందులో పైన చెప్పిన కార‌ణాలను కూడా వారు పేర్కొన్నారు. త‌మ‌ను త‌మ‌పై ఉన్న చైనా అధికారి అస్త‌మానం వేధింపులకు గురి చేస్తున్నాడ‌ని, అన‌వ‌స‌రం పెనాల్టీలు, ప‌నిష్‌మెంట్లు వేస్తున్నాడ‌ని, జీతం పెంచ‌మ‌ని అడిగితే ఇండియ‌న్స్ బిచ్చ‌గాళ్లు అని కామెంట్ చేస్తున్నాడ‌ని, దేశం గురించి చాలా అస‌భ్యంగా మాట్లాడుతున్నాడ‌ని వారు ఆ లేఖ‌లో పేర్కొని దాంట్లో సంత‌కాలు చేసి రాజీనామా లెట‌ర్‌ను ఇచ్చారు. అనంత‌రం వారు దాన్ని సోష‌ల్ మీడియాలోనూ షేర్ చేశారు. దీంతో ఇప్పుడీ విష‌యం వైర‌ల్ అయింది. ఒప్పో ఫోన్ల‌ను ఎవ‌రూ కొన‌వ‌ద్ద‌ని, అస‌లు ఒప్పోయే కాదు, చైనాకు చెందిన ఫోన్లు, ఇత‌ర వ‌స్తువులు ఏవీ కొన‌వ‌ద్ద‌ని సోష‌ల్ మీడియాలో క్యాంపెయిన్ ర‌న్ అవుతోంది. మ‌రి దీనిపై ఒప్పో ఇండియా యాజ‌మాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఆ చైనా ఉద్యోగిని మాత్ర వ‌దిలిపెట్ట‌కూడ‌దు..!

Comments

comments

Share this post

scroll to top