జక్కన్న కు తెలంగాణా పోరగాడి బహిరంగ లేఖ.

హలో మిస్టర్ జక్కన… నీ చెక్కుడు జర ఆపుతావా…..? బాహుబలి అనే సినిమా పేరుతో ఎప్పడి నుండి నస పెడుతున్నవో నీకు తెలుసా….. ? మిర్చి సినిమాలో నాజూగ్గా ఉన్న పోల్లగాణ్ణి 200 కెజీలు పెంచితివి.. మా ప్రభాస్ ను మనిషనుకున్నావా? లేకపోతే మిషిననుకున్నావా…? పబాస్ పెళ్లి జేసుకొని ఓ ఇంటోడు  కావాల్నా? అద్దా??

ఎడుపు గొట్టు తెలుగు సీరియల్లో కూడా గిన్ని ట్విస్టులుండవ్ కదా గడ్డపు సారు, పోస్టర్ల మీద పోస్టర్లు,వాయిదాల మీద వాయిదాలు, మధ్య మధ్యల పిచ్చెక్కిచ్చే మీ ట్వీట్లు….ఫస్ట్ లుక్కులు, టీజర్లు… అరె ట్విట్టర్ అంటే తెలియని నేను మీ బాహుబలి అప్ డేట్స్ కోరకు ట్విట్టర్లో పడిపోయా కదా జక్కన్న.

తీస్తే ఓ సినిమా తీయ్, మా రామ్ గోపాల్ వర్మ లెక్క సడీ సప్పుడు కాకుండా. అరె ఒకటే ట్విట్టర్ల మోత… వాయిదాల బాట…అప్ డేట్ ల గోళ….. మావూళ్ళ ఈరిగాడన్నట్టు  ముక్క తక్కువ బొక్క ఎక్కువ అయ్యింది యవ్వారం.

హాలివుడ్ రేంజ్ లో సినిమా అని ఊరిస్తవ్, హిందీ హక్కుల కొనుగోళ్ల కోసం కరణ్ జోహర్ క్యూ లైన్లో నిలబడిడ్రని ఉప్పందిస్తవ్….. విడుదల ఎప్పుడో క్లియర్ గా జెప్పవ్… నువ్వో పని జేయి జక్కన్న … గప్పునపోయి ఓ గుక్కెడు స్ప్రైట్ తాగు గప్పుడన్న నీ మాట సూటిగా సుత్తిలేకుండా వస్తదేమో…? ఇట్స్ క్లియర్ అన్నట్లు.

మే  31న పాటలినిపిస్తన్నవ్ … అరె మా ప్రభాస్ పాటలు ఇన్దాం అనుకుంటే గప్పట్ల గప్పుడే వాయిదా అన్నవ్…. పైకెళ్లి దాన్ని మరవగొట్టేందుకు టీజర్ రిలీజ్ జేసినవ్ .. అసలు 5 సెకండ్ల టీజర్ ఏంది భయ్… దానికేమైనా తలుందా..? తోకుందా….? అప్పట్లాగే ఏదో ఒక పోస్టర్ రిలీజ్ జేస్తే సరిపోయేది కదే… సప్పట్లు గొట్టి ఊరుకునే వాళ్లం… ఊరించి ఉసూరుమనిపించడం నీకు అలవాటైంది… నా లాంటి ఫ్యాన్స్ ను.

ఫస్ట్ లుక్ అంటివి, సెకండ్ లు అంటివి,థర్డ్ లుక్ అంటివి… అరె అసలు ఎన్ని లుక్కులొదులుతావే జనాల మీదకు. తేపకో లుక్కు ,తడవకో పిక్కు  బీచ్ మే టీజర్, ఈటితోనే సినిమా  సూపిస్తవా ఏంది.??

అందం-రహస్యం అని అర్థంగాని రెండు ముక్కలు ట్విటితివి అవంతిక అని తమన్న పోస్టర్ వదిలితివి.
ఆరడుగుల అనుష్క చేతికి సంకెళ్లేసి దేవసేన అని సూపితివి.
ప్రతి పదం లో విషం..ప్రతి అడుగు లో ఆగ్రహం..ప్రతి ఆలోచనలో అసూయ’.. అంటూ యొదో యేదాంతపు ముచ్చట్లు మూడంటివి… బిజ్జలదేవ పాత్రలో నాజర్ ఇరగదీసిండని మళ్లీ ఆశ రేపితివి…
రానా చేతిలో గదపెట్టి బిల్లాలదేవ అని టెమ్ట్ జేయబడితివి…. మా యంగ్ రెబెల్ స్టార్ భుజాలమీన శివలింగం ఎత్తించి పస్ట్ లుక్ లోనే మాబోటి ఫ్యాన్స్ పానాలు తీస్తివి… చివరాఖరున చిన్నపోళ్లగాన్ని నీళ్లల్ల ఒంటి చేతితో లేపిన ఇస్టైల్ జూసి … సినిమా టికెట్టుకయ్యే దుడ్లు గిప్పుడే జేబుల యేసుకునేలా జేస్తివి.

letter
జక్కన్నో గిన్ని పోస్టర్లలో నేనొక కామన్ పాయింట్ కనిపెట్టిన్నే ….. గదేందో తెలుసా…. యాన్ ఎస్ ఎస్ రాజమౌళి ఫిల్మ్ అనే ముద్రనే… ఎందుకంటే నేను మా బుడ్డోడి స్టూడెంట్ నెంబర్ వన్ నుండి నేను నీకు ఫ్యాన్, కూలర్ ,ఏసిని మరి.
నాకో డౌట్ ..? నీకు ఆ అర్జీవి సార్ గాలిగిట్టా సోకిందా …ఏంది?  ప్రీ పబ్లిసిటీల ఆయనను మించినవ్.
అరె 12 నిమిషాల ఫైటింగ్ సీన్ లీక్ అయ్యిందని ఆగమాగం జేసినవ్…. గిప్పుడేమో టీజర్ ను థియేటర్ల రిలీజ్ చేస్తానని, ఆ థియేటర్ల లిస్ట్ ఇచ్చి కొత్త ట్రెండ్ కు తెర లేపినవ్.

సరే చివరాఖరున ఒక్క మాట ఎంత టైం అయినా తీసుకో… గానీ మగధీర ను మించిన సినిమా తీసి.నా చేత శభాష్ అనిపించుకోవాలే. నూతీస్తవ్, నువ్వే తీయగలవ్,ఎందుకంటే చిన్న జీవం ఈగతోనే  తెలుగోళ్ల కానుండి అంగ్రేజోళ్ల  వరకు అందరితో  వెర్రి గుడ్ అనిపించినవ్.. అందుకే ఐ లవ్ యూ రాజా…..  మా పభాస్ జర జాగ్రత్త.

శనార్తి…….

మీ తెలంగాణా పోరగాడు

AZHARUDDIN

 

Comments

comments

Share this post

0 Replies to “జక్కన్న కు తెలంగాణా పోరగాడి బహిరంగ లేఖ.”

  1. Pavan Kumar says:

    nice trailer and nice letter toooo

  2. JaiPal says:

    nilanti vaallu vundali macchi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top