ఇన్నాళ్ళు మిమ్మ‌ల్ని వెన‌కేసుకొచ్చిన‌…. మేం పిచ్చోళ్ళ‌మా…? క‌త్తి మ‌హేష్ కి ఓ అభిమాని బ‌హిరంగ లేఖ‌.!

అయ్యా క‌త్తి మ‌హేష్ గారు….ఏంటిది.? ప్ర‌శ్నిస్తున్నాడు…ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ప్ర‌శ్నిస్తున్నాడు…ధైర్యంగా నిలబ‌డి ప్ర‌శ్నిస్తున్నాడు, ఒంట‌రిగా కొండ‌ను ఢీ కొడుతున్నాడ‌ని…. త‌లచి మీకు స‌పోర్ట్ గా ఉంటే అర్థాంత‌రంగా మీ పంథాను మార్చుకోడానికి కార‌ణమేంటి.? మిమ్మ‌ల్ని అభిమానించిన మేము మిమ్మ‌ల్ని అనుమానించాల్సిన ప‌రిస్థితి రాక‌ముందే ఈ మూడు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌ర‌ముంది.!

1) సంజ‌నా అనే అమ్మాయితో మీరు చేసిన ఛాటింగ్( సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నది) నిజ‌మేనా.? కాదా.? నిజ‌మైతే ఏ సంధ‌ర్భంలో ఇలా మాట్లాడాల్సి వ‌చ్చింది.? ఆ మెసేజ్ ల అర్థ‌మేంటో వివ‌రించ‌గ‌ల‌రు.?

2) ప‌వ‌న్ వ్య‌వ‌హార‌మంతా తెలిసిన‌ట్టు ఊగిపోయిన మీరు….కామ్ గా ఎలా ఉంటారు… ఆధారాలుంటే ప్ర‌జ‌ల‌కు ముందుగానే చూపాల్సిన బాధ్య‌త మీ మీద ఉంది.! ఎందుకంటే ఇప్పుడు ఆయ‌న ఓ పొలిటీషియ‌న్…ఆయ‌న గురించి తెలియాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఓట‌రుకు ఉంది.!

 

3) ఈ విష‌యంలో ఏమైనా క్విడ్ ప్రోకో దాగుందా….? మీ విష‌యం బ‌య‌టికి రాకుంటే ఆ విష‌యం బ‌య‌ట‌పెట్ట‌ను అనేలా..?

డే 1 నుండి ఈ వ్య‌వ‌హారంలో మీకు మ‌ద్ద‌తుగా ఉన్న మాలాంటి వాళ్ళంద‌రి మ‌దిలో ఇవే ప్ర‌శ్న‌లు తిరుగుతున్నాయి.! వీటికి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.!

Comments

comments

Share this post

scroll to top