గుంటూర్ టాకీస్ దర్శకుడికి సినిమా ప్రేక్షకుడి ఘాటు లేఖ…అది సినిమానా?లేక బూతుపురాణమా? అంటూ చీవాట్లు.

చందమామ కథలు అంటూ…మానవ సంబంధాలను అల్లుతూ సినిమా తీసి నేషనల్ అవార్డ్ సాధించిన  డైరెక్టర్ మరో సినిమా తీస్తున్నాడంటే మంచి ఎక్స్ పెక్టేషన్స్ తో సినిమాకు వెళ్లాడు ఓ సగటు సినిమా ప్రేక్షకుడు, దానికి తోడు జబర్థస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ అలరించే రష్మీ కూడా ఈ సినిమాలో ఓ మెయిన్ రోల్ చేస్తుందన్న ఆనందంతో బాల్కానీ టికెట్టు కొని సినిమా చూశాక అతడి రియాక్షన్ ఇది. డైరెక్ట్ గా డెైరెక్టర్ కే ఓ ఘాటు బహిరంగ లేఖ ను రాశాడు. ఆ లేఖ యథాతదంగా మీకోసం.

Guntur-Talkies-Telugu-Movie-Teaser-Rashmi-Gautam-Guntur-Talkies

నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారికి నమస్కారాలు.

చందమామ కథల్లాంటి మానవసంబంధాల విలువను తెలిపేలా సినిమా తీసిన మీరు. గుంటూరు టాకీస్ అంటూ మల్లు ఆంటీ సినిమాలకు  ఏ మాత్రం తీసిపోని సినిమా తీయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఇంకా నాకర్థం కావట్లేదు. అవును..! మిస్టర్ ప్రవీణ్ సత్తారు   నువ్వు తీసిన గుంటూర్ టాకీస్.. ఓ బూతు పురాణం. ముమ్మాటికీ బూతుపురాణమే, డౌటుంటే ఓసారి థియేటర్ కు వెళ్లి చూడు ప్రతి పది నిమిషాలకొకసారి వచ్చే ఆ సీన్లను చూడలేక ఫ్యామిలీతో వచ్చిన ప్రేక్షకులు ఎలా లేచి వెళ్లిపోతున్నారో చూడు.! చందమామ కథలతో జాతీయ అవార్డు పొందావ‌ని, పోస్టర్స్, ట్రైలర్స్‌ల‌లో కొత్త‌ద‌నం చూపించావని సినిమాకు వెలితే చిన్నపాటి పోర్న్ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూపించావు కదయ్యా.! కొత్తగా వచ్చే దర్శకులకు ఆదర్శంగా ఉంటావనుకున్న నువ్వు అదే అశ్లీల ఫార్మాట్ ను అంతకంటే ఎక్కువగా చూపించావ్ కదయ్యా.!

కరెక్టే  సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్గా ఉండాలి. అందుకని మరీ మాన‌వ సంబంధాల్ని ఇంత‌గా దిగ‌జార్చి చూపాల్సిన అవసరం ఉందంటావా భ‌య్యా.! ఈ సినిమాకు గుంటూర్ టాకీస్ అని పేరు పెట్టి కష్టజీవులకు కెరాఫ్ అడ్రస్ అయిన గుంటూరు జిల్లా వాసులను అవమానించినట్టే.!! నీ సినిమా న‌డ‌వ‌డానికి ( రష్మీ) సువ‌ర్ణ అనే క్యారెక్ట‌ర్ ను బొమ్మ‌గా వాడుకున్నావు. దొంగ‌త‌నం చేస్తూ దర్జాగా బ‌తికేయొచ్చు అని దొంగ‌ను దొర‌లా చూపించి పెద్ద త‌ప్పే చేశావు. సినిమా మొత్తాన్ని మ‌ద్య‌పానం, ధూమ‌పానంలతో నింపేశావ్.!

నాకో డౌట్ నీకు క‌థ‌లు దొర‌క‌లేదా? లేక క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని ఈ క‌థ ఎంచుకున్నావా? అర్థం కానీ అయోమ‌య‌స్థితిలో ఇంకా నేను నీ సినిమా గురించి ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా జబర్థస్త్ షోతో తెలుగు వారికి దగ్గరవుతున్న రష్మీకి ప్యూచర్ లేకుండా చేశావ్.(వస్తే గిస్తే ఆమెకు మళ్లీ ఇటువంటి పాత్రలే తప్ప…మంచి వెయిట్ ఉన్న పాత్రలొస్తాయని నేనకోట్లేదు). ర‌ష్మీకి తన త‌ర్వాత సినిమాలో చూపించాల్సిన‌వి ఏమీ లేకుండా ఇదే సినిమాలో మొత్తం షో చూపించేశావు.

ఎవరో డైరెక్టర్ ఈ సినిమా తీసాడంటే లైట్ గా తీసుకొని మన తెలుగు సినిమాకు ఇదేం కొత్తకాదులే అనుకునేవాడిని, కానీ ఫస్ట్ సినిమాతోనే ఓట్రెండ్ క్రియేట్ చేసిన నువ్వు కూడా అదుపు తప్పిన రొమాన్స్ ఉంటేనే కాసుల పంట అన్నట్టు సినిమా తీసావ్ చూడు అక్కడ నేను ఫీల్ అయ్యాను భయ్యా.!

ఇట్లు.

ఓ సగటు సినిమా ప్రేక్షకుడు.

అజహార్ షేక్.

Comments

comments

Share this post

scroll to top