గుణశేఖర్ కు చుక్కలు చూపిస్తున్న ఉత్తరం ముక్క.!?

తన డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవి సక్సెస్ తో మస్త్ జోష్ మీదున్న గుణశేఖర్ కు ఓ ఉత్తరం ముక్క.. చుక్కలు చూపిస్తుంది. గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తుంది. మరోసారి హిస్టారికల్ స్టోరితో సినిమా తీయాలంటేనే వణుకు పుట్టేలా చేస్తుంది. మొదట్లో ఆ ఓపెన్ లెటర్ ను లైట్ గానే తీసుకున్నప్పటికీ… రాను రాను సోషల్ మీడియా పుణ్యాన అది వైరల్ అయ్యి అంతటా వ్యాపించింది. అమ్మో రుద్రమదేవి పేరు చెప్పి గుణశేఖర్ చూపించింది అసలైన చరిత్రనా..?లేక  కాసుల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేసి, పాండ్స్ పౌడర్ తో మేకప్ వేసిన రెడీమేడ్ హిస్టరీనా..? అనే డౌట్స్ ను జనాల్లో క్రియేట్ చేసంది ఆ ఓపెన్ లెటర్.

ఆ లెటర్ లో  మీకోసం…..

హలో గుణ శేఖర్ గారు!

  • రుద్రమదేవి చరిత్రని తెలుసుకుందామని, ఆమె వీరగాధలు వీక్షిద్దామని సినిమాకు వచ్చిన నాకు ,ఏదో ‘జెండర్ ఐడెంటిటీ’ (జన్మ రహస్యం ) కాన్సెప్ట్ పైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం చూస్తునట్లు అనిపించిందే తప్ప ఎక్కడా రుద్రమ దేవి చరిత్ర కనిపించ లేదు.
  • అసలు సిసలైన రుద్రమ చరిత్ర తీయకుండా …కల్పితాలు జోడించి ,రుద్రమ ను అశ్లీలంగా చూపించి ,గోనగన్నారెడ్డి క్యారెక్టర్ నే ఎక్కువగా హైలైట్ చేసి ఎందుకని రుద్రమదేవి ని పనికిరాకుండా చేసి పడేసారు.?
  • రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన ..గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. మరి గోన గన్నారెడ్డినే ఎందుకు చూపించారు.? మిగతా వాళ్ళు ఏమైనట్టు?
  • వేయి స్తంభాల గుడి, పాలంపేటలోని రామప్ప గుడి, భద్రకాళి ఆలయం, ఘణపురం కోటగుళ్ళు కాకతీయుల శిల్పకళా పోషణకు, నైపుణ్యానికి చక్కని తార్కాణం. మరి సినిమాలో  వీటి ప్రస్తావన ఎందుకు  తీసుకురాలేదు?
  • రుద్రమకు ఇరవై ఐదవ యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రేశ్వరుడితో వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్ళు ముమ్మడమ్మ, రుద్రమ్మ కలిగారు. ఈమెకు మరో పెంపుడు కూతురు రుయ్యమ్మ కూడా ఉంది. తనకు మగ సంతానం లేక పోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది.ఇలాంటివి ప్రస్తావించకుండా,ఆమె జన్మ రహస్యాన్ని హైలెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
  • ఎనభై ఏళ్ల వయసు లో కత్తి పట్టి స్వయంగా కదన రంగాన దూకి అంబదేవుడిని ఓడిస్తుంది రుద్రమదేవి. ఇలాంటి వీరోచిత విన్యాసాలు ఎక్కడా చూపించలేదెందుకు?
  • పోనీ చివర్లో అయినా రుద్రమ వీరోచిత విన్యాసాలు చూసే అవకాశం కల్పించారా అంటే అదీ లేదు. ఎంత సేపు ,మీరు పెట్టిన డబ్బుని రాబట్టుకోడానికి ,గోన గన్నారెడ్డి పాత్రను..వింత వింత డైలాగ్ లను కలిపేసి వాడుకున్నారు.
  • నిజం చెప్పాలంటే,200 రూపాయలు పెట్టి ఈ సినిమా చూసే బదులు, 20 రూపాయలు పెట్టి రుద్రమ దేవి పుస్తకం కొన్నుకొని చదువుతే మాకు చాల విషయాలు తెలుస్తాయి.
  • రుద్రమదేవి పేరుతో సినిమా తీస్తున్నాను అని చెప్పి సినిమాలాగా తీస్తే తప్పులేదు, కానీ రుద్రమదేవి చరిత్రను నేటి తరానికి అందిస్తాను  అంటూ చెప్పుకొని,  మీ స్క్రిప్ట్ లో రాసుకున్న చరిత్రను ఇదే రుద్రమదేవి చరిత్ర అని జనాలపై రుద్దే ప్రయత్నం చేయకండి. చరిత్రను తిరిగి మీకు తోచినట్టు రాయకండి. చరిత్ర ను చెత్తగా మార్చకండి!!

Regards,
Dhana

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top