బాహుబలి పైరసీకి బ్లాక్ టికెట్ కు మధ్య లింకేంటి.? అభిమాని అంతరంగం!

సగటు సినిమా ప్రేక్షకుడు చేేసే విమర్శ   ఏదైనా అందులో ఓ లాజిక్ ఉంటుంది. ఇప్పటి వరకు బాహుబలి టిక్కెట్లు దొరక్కపోతే ధర్నాలకు దిగిన అభిమానులను చూశాం, ప్లీజ్ పైరసీను ప్రోత్సాహించకండీ అనే డైరెక్టర్లను చూశాం కానీ తొలిసారి … ఓ సగటు సినిమా అభిమాని తన ప్రశ్నలతో బాహుబలి పెద్దలకు సవాల్ విసిరాడు…

అతడి ఆవేధన అతని మాటల్లోనే…

  • మొదటి ప్రశ్న బాహుబలి సినిమా పైరసీ కాకుండా మేం చూసుకుంటాం, కానీ బాహుబలి సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మకుండాచూసే దమ్ము మీకుందా?
  • ప్రశ్న నెండర్ 2 సినిమా హాల్ లో కనీస వసతుల గురించి మీరెప్పుడైనా కోర్టుకెళ్లారా? పోనీ  థియేటర్ క్యాంటీన్ లో రెండితల ధరలకు అమ్మే వస్తువుల గురించి మీరెప్పుడైనా పోలీస్ స్టేషన్ల మెట్లెక్కారా?
  • మూడవ ప్రశ్న.. మహానగరంలో రోజుకు 200 సంపాదించే వ్యక్తి ఇప్పటికే 500 నుండి 1000 పలుకుతున్నబాహుబలి టికెట్స్ ను కొనగలడా…..?
  • ఫైనల్ గా ప్యామిలీతో కలిసి ఇటువంటి సినిమాను చూడాలంటే సామన్యుడి సగం జీతం ఇటు పెట్టాల్సిందేనా…?

good question

పైరసీ ని నిజమైన సినిమా అభిమాని ఎప్పుడు ప్రోత్సాహించడు, కానీ థియేటర్ కు వచ్చిన అభిమాని ఇలా పార్కింగ్ నుండి పాప్ కార్న్ వరకు నిలువు దోపిడికి గురవుతున్నారు అని చెప్పడమే ఈ పోస్ట్ యొక్క ఇంటెక్షన్….ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి.

CLICK: పవన్ ను దించేశాడు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top