ఊపిరి సినిమా డిలేటెడ్ సీన్స్. సినిమా లో ఉండి ఉండాల్సింది.

నాగార్జున ,కార్తీ ,తమన్నాలు నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఊపిరి…వైవిధ్యమైన కథలో అంతే అందంగా తెరకెక్కించాడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని డిలేటెడ్ సీన్ల ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిత్ర యూనిట్. సినిమా నిడివి కారణంగా తొలగించిన  ఆ సీన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. తమన్నా, కార్తీ, ప్రకాశ్ రాజ్ ల మద్య సీన్… నాగార్జున కు కార్తీ స్నానం చేయిస్తున్న సీన్, ఈగ తో ఫన్ ను మెసేజ్ ను ఇప్పిస్తున్న  సీన్ లతో కూడిన ఈ మూడు డిలేటెడ్ సీన్లు కడుపుబ్బా నవ్వించాయి. సినిమాలో మంచి మెసేజ్ ఇస్తూనే ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.దాని కోసం అడల్ట్ కామెడీ కాకుండా ఆరోగ్యకర కామెడీని ఎన్నుకున్నందుకు డైరెక్టర్ ను అభినందించాల్సిందే……….

ఈ డిలేటెడ్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి..ఇవి కూడా సినిమాలో ఉంటే బాగుండేది అని చాలా మంది అనుకుంటున్నారు. నాగ్ , కార్తీ నటన, తమన్నా గ్లామర్ , వైవిధ్యమైన స్టోరీ స్క్రీన్ ప్లే లతో సినిమా సూపర్ హిట్ సాధించింది.  విభిన్న స్టోరీలను మంచిగా ఉంటే తెలుగు ప్రజలు తప్పక ఆదరిస్తారని ఈ సినిమాతో మరోమారు ప్రూవ్ అయ్యింది. ఇక ప్రయోగాలు చేయడంలో ఎవరైనా నా తర్వాతే అని నాగ్ మరోసారి రుజువు చేశాడు. ఇక కార్తీ డైరెక్ట్ గా తెలుగు లో నటించిన తొలిచిత్రం కూడా ఇదే కావడం విశేషం.

Watch OOPiri Deleted Scenes:

Comments

comments

Share this post

scroll to top