మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఈ ఏడు జాగ్రత్తలు పాటించండి..

ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లగా బతకాలంటే చాలా కష్టం అయింది..ప్రతి క్షణం ప్రపంచ నలుమూలలో ఏదో ఒక చోట అమ్మాయిలు అత్యాచారానికి గురౌతూనే ఉన్నారు. ఆరు నెలల పసిపాప దగ్గరనుండి అరవైఏళ్ల ముసలమ్మ వరకు ఎవరు ఎప్పుడు ఎలా కామాంధులకు బలి అయిపోతారో అర్దం కాని పరిస్థితి..నిర్బయ లాంటి కఠిన చట్టాలు వచ్చినప్పటికి.. అత్యాచారాలు ఆగట్లేదు..అత్యాచారం చేసిన నిందితులకు శిక్షలు పడట్లేదు..ఇలాంటి పరిస్థితులలో ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..అవేంటో చూడండి.

  • చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు..
  • హ్యాండు బ్యాగులో పెప్పర్ స్ఫ్రే,అలారం వెంటపెట్టుకుని వెళ్లండి.ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే పెప్పర్ స్ప్రే తీసుకుని వారిపై స్ప్రే చేయండి..మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉన్న ప్రధాన ఆయుదం ఇది..దానికంటే ముందు మీరు ఆత్మస్థైర్యంతో ఉండడం ముఖ్యం.
  • కొత్తవారితో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారి మధ్యలో వాహనం ఆపనీయకండి.ఒకవేళ ఆపాల్సి వచ్చినా చుట్టూ జనసందోహం ఉందోలేదో చూసుకోండి.

  • ఎప్పుడన్నా పరిచయం లేని వారితో,అనుమాన పూరితంగా ఉన్న వ్యక్తులతో లిఫ్టులో ప్రయాణించాల్సి వస్తే వెంటనే అన్ని ఫ్లోర్ల బటన్లను నొక్కేయండి..
  • క్యాబ్లో వెళ్తున్నప్పుడు దాని డీటెయిల్స్ మీకు దగ్గరివారికి పంపండి.అంతేకాదు క్యాబ్ ఎక్కిన వెంటనే మీ ఇంట్లో వారికి కాల్ చేసి క్యాబ్ డీటెయిల్స్ చెప్పండి ఫలానా నంబర్ క్యాబ్లో వస్తున్నా,ఫలానా చోట ఉన్నా అని..మీ మాటలు విన్న డ్రైవర్ కూడా మీపై అఘాయిత్యం చేయడానికి సాహసించడు.

  •  మీకు తెలియని వారెవరైనా కూల్ డ్రింక్ ఇస్తే ఎవాయిడ్ చేయండి.తాగమని బలవంత పెడితే నిర్మొహమాటంగా చెప్పేయండి వద్దు అని…
  • వీటన్నిటి కన్నా ముఖ్యమైనది మానసికంగా ధైర్యంగా ఉండడం..ముఖంలో ఎక్కడా కూడా భయపడుతున్నట్టుగా ఎదుటివారికి కనపడనీయకండి..మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top