యాప్స్ క్రియేష‌న్‌లో ఆన్‌గో టాప్

టెక్నాల‌జీలో అప్ డేట్ అవ‌క పోతే.ఆఖ‌రున నిల‌బ‌డ‌తాం. ప్ర‌తి క్ష‌ణం పోటీనే. ఓ ర‌కంగా టీ -20 క్రికెట్ మ్యాచ్ లాంటిది. టాస్ ద‌గ్గ‌రి నుండి బాల్ కు.బ్యాట్ కు మ‌ధ్య యుద్ధం . ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌డం క‌ష్టం. అక్క‌డ షాట్లు కొట్టేవాళ్లు.ప‌రుగుల వ‌ర‌ద పారించే వాళ్ల‌కు ప్ర‌యారిటీ ఎక్కువ‌గా ఉంటుంది. వారే హీరోలు.వాళ్ల వెంట కంపెనీలు . వారి పేరు మీదే కోట్లలో వ్యాపారం. ఇదంతా ఓ మాయా మార్కెట్ జాలం. ఇపుడు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ వ‌ల్ల ప్ర‌పంచం త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంటోంది కొత్త‌గా.నిత్య నూత‌నంగా. రోజుకో టెక్నిక‌ల్‌గా న్యూ ఫార్మాట్‌లు వ‌స్తున్నాయి. వీటిలో ఆటోమేష‌న్‌, గేమింగ్, ఆప్స్ క్రియేష‌న్‌, డిజిట‌ల్ మార్కెటింగ్.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటిలో మొబైల్ అప్లికేష‌న్ త‌యారీకి వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి డిమాండ్ ఉంది.

ongo app

ప్ర‌తి కంపెనీకి స్వంతంగా వెబ్ సైట్ తో పాటు యాప్ కూడా ఉండాల్సిందే. లేక‌పోతే పోటీ ప్ర‌పంచంలో వెనుక‌బ‌డి పోవ‌డం ఖాయం. ఇదంతా భారీ ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. యాప్ డెవ‌ల‌ప్ చేయాలంటే చాలా క‌ష్టప‌డాల్సి ఉంటుంది. టెక్నిక‌ల్ , కోడ్ ఎక్స్ ప‌ర్ట్స్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు. యాప్స్ త‌యారు చేయ‌డం ఒక ఎత్త‌యితే.దానిని మార్కెటింగ్ చేసుకోవ‌డం మ‌రో ఎత్తు. దీనికి వంద‌లాది మంది త‌మ మెద‌ళ్ల‌కు ప‌దును పెడ‌తారు. త‌మ క్రియేటివిటీకి ప్రాణం పోస్తారు. ఎక్క‌డైనా డిఫ‌రెంట్ గా ఆలోచించ‌డ‌మే కాదు అద్భుతంగా .అంద‌రికీ న‌చ్చేలా డిజైన్ చేయ‌డం కూడా క‌త్తి మీద సామే. ఇది కూడా ఓ అద్భుత‌మైన క‌ళ‌గానే భావించాల్సి ఉంటుంది. ఆర్టిస్టు చిత్రానికి ప్రాణం పోస్తే.ఇక్క‌డ క్రియేట‌ర్స్.టెక్నిక‌ల్ గా సౌండ్ ఉన్న వారంతా యాప్స్ ను రూపొందించ‌డంలో క‌ష్ట‌ప‌డ‌తారు. తేడా ఒక్క‌టే భిన్నంగా ఆలోచించ గ‌ల‌గ‌టం.

గేమింగ్, మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్, స్పోర్ట్స్‌, ఫ్యాష‌న్స్‌, ఈ కామ‌ర్స్‌.లాంటి వాటిపై ఎక్కువ‌గా యాప్స్ త‌యార‌వుతున్నాయి. ప్ర‌తి సంస్థ త‌న వ్యాపారాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డుతోంది. ఇందులో యాప్స్ అయితే త్వ‌ర‌గా డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది. ఎక్క‌డైనా ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవ‌డం సులువ‌వుతుంది. దీనికి ఉన్న సౌల‌భ్యం వ‌ల్ల యాప్స్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా విప‌రీత‌మైన క్రేజ్.డిమాండ్ నెల‌కొంది. యాప్స్ క్రియేష‌న్ కోసం ఎన్నో కంపెనీలు వెలిశాయి. ఒక్కొక్క‌రిదీ ఒక్కో స్ట‌యిల్. ఐటీ రంగానికి కేరాఫ్‌గా మారిన హైద‌రాబాద్‌లో ఆన్ గో ఫ్రేం వ‌ర్క్‌.కంపెనీ త‌క్కువ టైంలో యాప్స్ క్రియేష‌న్‌లో టాప్ పొజిష‌న్‌లోకి చేరుకుంది. దీని వెనుక ఆ సంస్థ లో ప‌నిచేసే వారి శ్ర‌మ దాగి ఉంది. వీరి ప్ర‌త్యేక‌త ఏమిటంటే మ‌న‌కు ఏం కావాలో చెబితే చాలు.కేవలం ఒకే ఒక్క గంట వ్య‌వ‌ధిలో అంటే 60 నిమిషాల్లో మ‌న‌కు చెందిన‌.మ‌న‌కు కావాల్సిన యాప్ రెడీ చేసి ఇస్తారు. క్లారిటీ లో కానీ.కంటెంట్ విష‌యంలో కానీ.నాణ్య‌త‌లో కానీ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాక పోవ‌డం వీరి ప్ర‌త్యేక‌త‌. టెక్నిక‌ల్‌గా అనుభ‌వం క‌లిగిన ఉద్యోగులు ఉండ‌డం తో క్రియేటివీటికి అద్దం ప‌డుతున్నాయి. వీరు త‌యారు చేసిన యాప్స్.

ఆన్ గో .ఫ్రేం వ‌ర్క్ ఫౌండ‌ర్ అన‌సూయ అకిల్ల‌. ఆమెతో పాటు భ‌ర్త రామ ఇద్ద‌రూ ఐటీ రంగంలో అనుభ‌వం క‌లిగిన వారే. నేచ‌ర్ ట్రీట్ పేరుతో ఆర్గానిక్ స్టోర్ న‌డిపారు అన‌సూయ‌. వీరిద్ద‌రికి గేమ్స్ అంటే ప్రాణం. ఒక రోజు ఆట ఆడుతుండ‌గా అటూ ఇటూ క‌ద‌ల‌డం ఇబ్బందిగా మారింది. దీనిని గ‌మ‌నించిన ఆమె ఎక్క‌డికి క‌ద‌ల‌కుండానే ఒకే చోట కూర్చుని ఆడితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌నే యాప్‌ను క్రియేట్ చేసేలా చేసింది. అంత‌కు ముందు ఈ రంగంలోకి ఎంట‌ర్ కావాలంటే దానిలో అనుభవం ఉండాలి. పాత్ర టెక్నాల‌జీ కంపెనీలో ప‌ని చేసింది. వాయిస్ బేస్డ్ పోక‌ర్ గేమ్ పేరుతో ఇద్ద‌రూ యాప్ త‌యారు చేశారు. దీనిని ఓ అమెరిక‌న్ కంపెనీకి అమ్మేశారు. వ‌చ్చిన డ‌బ్బుల‌తో ఆన్ గో పేరుతో స్టార్ట‌ప్ కంప‌నీ స్టార్ట్ చేశారు. మొద‌ట్లో అంద‌రిలాగే ఇబ్బందులు ప‌డ్డారు. ఆ త‌ర్వాత వీరు గంట‌లో యాప్స్ త‌యారీకి విప‌రీత‌మైన డిమాండ్ వ‌చ్చింది. క్ల‌యింట్స్ రావ‌డం ప్రారంభ‌మైంది. 2016లో ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ చేతుల మీదుగా కంపెనీ త‌ర‌పున అవార్డు తీసుకున్నారు. డిజిట‌ల్ తెలంగాణ పేరుతో టీఎస్ స‌ర్కార్ ఎంతో తోడ్పాటు అందిస్తోంద‌ని అంటున్నారు ఆమె.

మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వ‌స్తుంటాయి కూడా. ఎవ‌రి మార్కెట్ వారిదే. ఇక్క‌డ టెక్నిక‌ల్ గా ఎంత ప‌ట్టు సంపాదిస్తే నిల‌బ‌డ‌గ‌లం లేక పోతే కూలి పోతాం. డిఫ‌రెంట్‌గా ఆలోచించ‌డ‌మే స‌రిపోదు.మిగ‌తా వారితో పోటీ ప‌డాలంటే.మ‌నం వారికంటే మెరుగైన సేవ‌లు అందించాలి. అందు కోసం టెక్నాల‌జీని అందిపుచ్చు కోవాలి. అప్పుడే స‌క్సెస్ మ‌న‌ద‌వుతుంది అంటున్నారు భార్య భ‌ర్త‌లు అన‌సూయ‌.రామ్‌లు. సో.యాప్స్ కావాలంటే మీరూ ట్రై చేయండి. ఆన్ గో ఫ్రేమ్ వ‌ర్క్‌ను సంప్ర‌దిస్తే చాలు .మీకంటూ ఓ బ్రాండ్.ఇమేజ్ ఏర్ప‌డుతుంది. మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది.

Comments

comments

Share this post

scroll to top