215 మంది ప్రయాణించాల్సిన విమానంలో ఒక్కతే ప్రయాణించింది. అలా అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే సెలెబ్రిటీ అయ్యింది.

మీరు విమానంలో ఎప్పుడైనే ప్రయాణం చేశారు. అది కూడా ఒంటరిగా. అసలు విమానమే ఎక్కలేదండి బాబూ.. అంటే ఇక ఒక్కరే ఎక్కారా అని ఎందుకు అడుగుతారులెండి అని అంటారా.? 215 మంది ప్రయాణం చేయాల్సిన  విమానంలో  ఒక్క  యువతి మాత్రమే ప్రయాణం చేసి లక్కియెసస్ట్ ప్యాసింజర్ అనిపించుకొని రాత్రికి రాత్రి పాపులర్ అయింది. అదెలా అంటారా? అయితే మొత్తం స్టోరీ చెప్పాల్సిందే.. చైనాలో న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సమయంలో సెంట్రల్ ఊహున్ నుండి దక్షిణ చైనాలోని గుయాంజుకు లక్షల మంది ప్రయాణికులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. పొగమంచు, తుఫాను కారణంగా విమానాలు రావడం ఆలస్యమవుతుందని అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కొన్ని గంటల సమయం పడుతుదని ముందే తెలిపారు. అందుకని చాలామంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేయించుకొని రైళ్ళలో వెళ్ళిపోయారు.

చైనాకు చెందినా ఝాంగ్ మాత్రం తన టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా అలానే విమానం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఝాంగ్ వెళ్ళాల్సిన CZ2833 విమానం 10 గంటలు ఆలస్యoగా  బయలుదేరుతుందని చెప్పారు. కొన్ని గంటల తర్వాత ఆ విమానం వచ్చింది. అయితే ఆ విమానంలో టికెట్స్ బుక్ చేసుకున్న వారిలో, ఒక్క ఝాంగ్ మాత్రమే ఉంది. మిగతా ప్రయాణికులు ముందు విమానాలు, రైళ్ళలో వెళ్ళిపోయారు.ఏం చేయాలో తెలియని దక్షిణ చైనా విమానయాన సిబ్బంది ఒక్క ఝాంగ్ నే గుయాంజ్ కు తీసుకెళ్లాల్సిందిగా నిర్ణయం తీసుకుంది. ఝాంగ్ సెంట్రల్ ఊహున్ నుండి గుయాంజ్ కు చెల్లించిన టికెట్ ధర 1200 యుయన్ (181 యుఎస్ డాలర్లు). అందుకని ఆమెను మాత్రమే 215 మంది ప్రయాణం చేసే ఆ విమానంలో గుయాంజ్ కు తీసుకెళ్ళారు.

single

ఫ్లైట్ లో తనక్కొ ప్యాసింజర్ నే ప్రయాణం చేశానని, ఈ అవకాశం జీవితంలో కొందరికి మాత్రమే వస్తుందని, విమానంలో దిగిన సెల్ఫీ ఫోటోలను తన సోషల్ మీడియా ఫ్రెండ్స్ తో పంచుకుంది. ఝాంగ్ పేరు ఒక్కసారిగా ప్రపంచమంతా వినిపించింది. ఈ విమానంలో ప్రయాణం చేసిన ఒక్క ప్రయాణికురాలిగా పాపులర్ అయిన ఝాంగ్ నలుగురు ఫ్లైట్ అసిస్టెంట్స్ తనకు ఏం కావాలో దగ్గరుండి చూసుకున్నారని, స్నేహ పూర్వకంగా ఉన్నారని, విమానాన్ని నడిపిన పైలట్ కొద్దిసేపు నాతో మాట్లాడానని ఎంతో సంతోషంగా తెలిపింది ఝాంగ్.
30CEF71000000578-0-image-a-17_1454491111223
నువ్వెంతో అదృష్టవంతురాలివని,ఇది అందరికీ వచ్చే ఛాన్స్ కాదని, ఝాంగ్ పెట్టిన ఫొటోస్ షేర్ చేస్తూ ఆమెను అభినందనలతో ముంచెత్తారు సోషల్ మీడియా ఫ్రెండ్స్. సిస్టర్ ప్రపంచంలో నీ అంత అదృష్టం మరెవరికీ రాదు, లక్కియెస్ట్ ప్యాసింజర్ వఅంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇలా కొందరు ఝాంగ్ ను అభినందిస్తుంటే మరికొందరు మాత్రం ఇబ్బందికర సమయాలలో ఒక్క ప్రయాణికురాలినే తీసుకువెళ్ళడం ఎందుకు? ఇంకా ఆలస్యంగా బయల్దేరి చాలా మంది ప్యాసింజర్లను తీసుకెళ్లవచ్చు. అనవసరంగా ఒకరికోసం సర్వీసునడిపి ఇంధనాన్ని వృధాచేశారని కామెంట్స్ పోస్ట్ చేశారు.
చైనా నూతన సంవత్సరం ఫిబ్రవరి 8న. (ఈ సంవత్సరంను మంకీ ఇయర్ అంటారు). ఈ నూతన సంవత్సర వేడుకలకు ఎక్కడి నుండో ప్రయాణికులు కొన్ని లక్షలమంది సొంతఇంటికి చేరుకొని కుటుంబ బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.నూతన సంవత్సరం ముందు సాయంత్రం తమ బంధు మిత్రులతో గడపాలని లూనర్ చెబుతుంది. ఇక న్యూ ఇయర్ వేడుకలు ముగియగానే మళ్ళీ తిరుగు ప్రయాణం సాగిస్తారు.

Comments

comments

Share this post

scroll to top