చైనాకు చెందిన మొబైల్స్ తయారీ కంపెనీ వన్ ప్లస్ గురించి తెలుసు కదా. వన్ ప్లస్ వన్ మొదలుకొని వన్‌ప్లస్ 2, 3, 3టీ ఫోన్లు రాగా… ఇప్పుడు తాజాగా వన్ ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. ఈ క్రమంలో ఈ ఫోన్ కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యూజర్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ను వన్ ప్లస్ సంస్థ జూన్ 20వ తేదీన విడుదల చేసింది. భారత్‌లో దీన్ని జూన్ 22వ తేదీన విడుదల చేసింది. అయితే విడుదలకు ముందు వన్ ప్లస్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వన్ ప్లస్ 5 ఫోన్‌ను ఆ సంస్థ ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఏ నగరంలో విడుదల చేయనుందో ప్రపంచ పటంలో మ్యాప్ పాయింట్స్ రూపంలో తెలియజేస్తూ వన్ ప్లస్ ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఆ వీడియో విడుదల చేయడం ఏమోగానీ వన్‌ప్లస్ ఓ ఘోరమైన తప్పిదం చేసింది. అదేమిటంటే…
మ్యాప్‌లో చూశారుగా.. ఏమీ తేడా కనిపించడం లేదా..? అయితే ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి. ఏం తెలుస్తుంది..? భారత దేశ మ్యాప్‌ను మొత్తం చూడండి. ఏమీ తెలియడం లేదా..? మరోసారి చూడండి..! ఆ.. ఏదో తేడాగా ఉంది కదా. అవును, ఉంది. మ్యాప్ కరెక్ట్‌గా లేదు. ఓ పార్ట్ మిస్ అయింది. అదేనండీ.. జమ్మూ కాశ్మీర్ లేదు. చూశారు కదా. అవును, ఆ పార్ట్ లేదు. దాన్ని పాకిస్థాన్‌లో కలిపేసింది వన్ ప్లస్ కంపెనీ. జమ్మూ కాశ్మీర్ లేకుండా ఉన్న ఇండియాను మ్యాప్ లో చూపింది.
అయితే వన్ ప్లస్ విడుదల చేసిన ఆ వీడియోలో ఇండియా మ్యాప్ సరిగ్గా లేదన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించారు. దీంతో ఇప్పుడీ విషయం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోనైతే ఈ విషయం వైరల్ అవుతోంది. చాలా మంది వన్ ప్లస్ కంపెనీ క్షమాపణలు చెప్పాలని, ఆ సంస్థ చాలా ఘోరమైన తప్పిదం చేసిందని అంటున్నారు. మరి ఈ విషయం పట్లయితే వన్ ప్లస్ ఇంకా స్పందించలేదు. ఏం చేస్తుందో వేచి చూడాలి..!