ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ…

ప్రపంచం లో కోటికొకరు, 100 కోట్లలో ఒకరు అనే పదం వింటూ ఉంటాం, కానీ ప్రపంచం లో 470 కోట్లలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందంట, ఆమె ఒకరికి కాదు, ఇద్దరికి కాదు ఏకంగా 6 గురికి ఒకేసారి జన్మనిచ్చింది. ఇద్దరు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు. వివరాల్లోకెళితే…

అమెరికా లోని టెక్సాస్ లో ఈ అరుదైన ఘటన జరిగింది. ఈ అరుదైన ఘటన 4.7 బిలియన్ మందిలో ఒక్కరికే జరుగుతుందట, అంటే 470 కోట్ల మందిలో ఒక్కరు మాత్రమే ఇలా ఆరుగురికి జన్మనివ్వగరట. సామాన్యంగా ముగ్గురు నలుగురికి ఒకేసారి జన్మనిచ్చారు అంటేనే ఆ వార్త ఎంతో వైరల్ అవుతుంది, అలాంటిది ఒకేసారి 6 గురికి జన్మనిచ్చారు అంటే ఇంక వైరల్ కాకుండా ఎలాగుంటుంది.

9 నిమిషాల్లో.. :

9 నిమిషాల్లో ఆమె 6 గురికి జన్మనిచ్చారు, ప్రస్తుతం 6 గురు పిల్లోలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు, ఆ ఆరుగురు పిల్లోళ్లని ఆసుపత్రి లోని ఐ సి యూ లో పర్యవేక్షణ లో ఉంచారు, 6 గురికి జన్మనిచ్చిన తల్లి తెల్మా చియాక ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. టెక్సాస్‌లో ఉన్న వుమెన్స్ హాస్పిటల్‌ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఈ డెలివరీని సిక్స్ టప్లెట్స్ అని అంటారట. సిక్స్ టప్లెట్ అంటే ఒకే డెలివరీలో ఆరుగురు పిల్లలకు జన్మనివ్వడం.

సోషల్ మీడియా.. :

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది, ఈ వార్త విన్నాక చాలా మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ వార్త ప్రతి ఒక్కరు, తల్లితో సహా పిల్లోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Tweet:

Comments

comments

Share this post

scroll to top