ఒకవైపు ముమైత్ – మహేశ్ ల ప్రేమాయణం..మరోవైపు జ్యోతి ఎలిమినేషన్..!

 టెలివిజన్ రంగంలో అత్యంత అట్టహాసంగా ప్రారంభమయినా షో బిగ్ బాస్..ఎన్జీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో వారం రోజులు పూర్తి చేసుకుంది.ఎలిమినేషన్ రౌండ్ రావడం ఒకరు ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగింది.బిగ్ బాస్ షో
నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్… జ్యోతి …ఇది ఇలా ఉంటే మరోవైపు ముమైత్ ఖాన్ ప్రేమాయణం…
తొలివారం ఎలిమినేషన్‌కు ఐదుగురు సభ్యులు కత్తి కార్తీక, మహేష్ కత్తి, మధుప్రియ, హరితేజ, జ్యోతి నామినేట్ అవ్వగా..శనివారం రాత్రి మధుప్రియ, హరితేజ, కత్తికార్తీకలు సేఫ్‌జోన్‌కు వెళ్లారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఆదివారం రాత్రి మహేష్ కత్తి సేఫ్‌జోన్‌కు వెళ్లగా.. జ్యోతి ఎలిమినేట్ అయ్యారు. శనివారం రాత్రి మహేష్ కత్తి కన్ఫర్మ్ అన్నట్టు ఎన్టీఆర్ ప్రకటించినప్పుడు హౌస్‌మేట్స్ కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. కానీ జ్యోతిని ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు హౌస్ మేట్స్ ఏమాత్రం స్పందించలేదు..ఎలిమినేషన్ నామినేషన్‌లో అత్యధికంగా 7 ఓట్లు వచ్చిన జ్యోతి ‘బిగ్‌బాస్’ నుంచి తొలగిపోయారు. ప్రేక్షకుల నుంచి కూడా ఆమెకు మద్దతు రాకపోవడంతో బిగ్‌బాస్ నిర్ణయం మేరకు ఫస్ట్ ఎలిమినేటర్‌గా ఎన్టీఆర్ ఆమె పేరును ప్రకటించారు. మరోవైపు జ్యోతి కూడా తన కొడుకుని మిస్ అవుతున్నానని బాదపడ్డం..షో కోసం కొడుకుని హాస్టల్లో చేర్పించడం మనకు తెలిసిందే…

మరోవైపు మహేశ్ కత్తి,ముముత్ ఖాన్ ల ప్రేమాయణం..ఆసక్తికరంగా మారింది.వాస్తవానికి బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ తెలుగే మాట్లాడాలనే నియమం ఉంది కానీ ముమైత్ ఖాన్ తెలుగు తప్ప ఇంగ్లీషు హిందీ మాట్టాడ్డం సబ్ టైటిల్స్ తో ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు.జ్యోతి ని  ముమైత్ కి టీచర్ గా పెట్టినప్పటికి ముమైత్ ఖాన్ మహేశ్ నే గురువుగా కోరుకోవడం…మహేశ్ ఎలిమినేట్ అవుతాడేమో అనే సంధర్బంలో ముమైత్ ఏడవడం…బయటకలుస్తాం కదా అని ముమైత్ ని కత్తి ఓదార్చడం…మాటిమాటికి ముమైత్ కత్తి మహేశ్ ని హగ్ చేసుకోవడం…నిజంగా ఆశ్చర్యమే..

నిజానికి బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యేప్పుడు కత్తి మహేశ్ ముమైత్ కి పరిచయమే లేదు కానీ వారం రోజుల్లో అంతా మ్యాజిక్ లా అయిపోయింది..ముందు ముందు ఇంకా ఏం చూస్తామో ఏంటో ఈ షో లో…

.

Comments

comments

Share this post

scroll to top