ప్రతీక్ కుమార్ అనే వ్యక్తి తన బాబు తో కలిసి తన బండి మీద బంధువుల ఇంటికి వెళుతున్నాడు. రోడ్డు మొత్తం బిజీబిజీగా ఉంది ఎవరి పనిలో వారున్నారు అంతలోనే…..ఓ బ్లాక్ హోండా కార్ రయ్ మంటూ దూసుకొచ్చింది. దానికి ముందున్న ప్రతీక్ బైక్ ను ఢీ కొట్టింది దీంతో ప్రతీక్ ఎగిరి కార్ అద్దాలపై పడ్డాడు.. అతని కొడుకు రోడ్డు మీద పడ్డాడు. అయినా కార్ డ్రైవర్ కార్ ను ఆపకుండా అలాగే వెళ్లాడు… అలా ఓ కిలోమీటర్ వెళ్లిన తర్వాత కార్ అద్దాల మీద పడున్న ప్రతీక్ పట్టు తప్పి కింద పడ్డాడు..అంతలోనే అటుగా వస్తున్న మరో వాహనం అతడిని ఢీ కొట్టింది. దీంతో ప్రతీక్ కు తీవ్రగాయాలయ్యాయ్. ఈ ఘటన మర్చి 28న గుర్గావ్లో జరిగింది.
Watch Video: